ఉపాధి హామీ పనుల్లో విషాదం... మట్టి పెల్లలు కూలి ఒకరు మృతి

ఉపాధి హామీ పనులు చేస్తుండగా మట్టి పెల్లలు కూలి ఒకరు మృతి చెందగా, మరి కొందరికి తీవ్ర గాయాలైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం లో చోటుచేసుకుంది.

మండలంలోని వెంకట్రావు పేట గ్రామ చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తూ, తీసిన గుంత పక్కన సేదతీరే క్రమంలో ఒక్కసారిగా మట్టిపెళ్లలు కూలడంతో ఈ ఘటన జరిగింది.

క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా, మారుపాక రాజవ్వ (50) చికిత్స పొందుతూ మరణించింది.కర్ణాల లహరి, పల్లం దేవవ్వ, కర్నాల శ్యామల, ఎడ్ల రామవ, వద్నాల అమృత, సందు చంద్రయ్యలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతున్నారు.

Latest Rajanna Sircilla News