హనుమాన్ రిజల్ట్ టాలీవుడ్ స్టార్ హీరోలకు నేర్పిన పాఠమిదే.. అలాంటి సినిమాల్లో నటిస్తే మాత్రమే హిట్టంటూ?

ప్రస్తుత కాలంలో సినిమా ఎంత పెద్ద హిట్ అయినా మూడు వారాల పాటు థియేటర్లలో ఆడే పరిస్థితులు కనిపించడం లేదు.

ఓటీటీల హవా( OTT ) పెరగడంతో సినిమాకు ఇండస్ట్రీ హిట్ రేంజ్ టాక్ వస్తే తప్ప చాలామంది థియేటర్లలో సినిమా చూసే పరిస్థితులు కనిపించడం లేదు.

ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే 1000 నుంచి 1500 రూపాయల రేంజ్ లో ఖర్చు అవుతూ ఉండటంతో చాలామంది థియేటర్లలో సినిమా చూడటానికి ఆసక్తి చూపించడం లేదు.అయితే హనుమాన్( Hanuman ) రిజల్ట్ టాలీవుడ్ స్టార్ హీరోలకు నేర్పిన పాఠం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంచి కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలలో నటిస్తే మాత్రమే సక్సెస్ దక్కుతుందని కథ నచ్చకపోయినా చెత్త సినిమాలలో నటిస్తే మాత్రం ఊహించని స్థాయిలో నష్టపోక తప్పదని ప్రూవ్ అవుతోంది.

Tollywood Star Heroes Need To Learn With Hanuman Movie Details Here Goes Viral

టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా( Pan India Movies ) పేరుతో చెత్త కథలను ఎంచుకుంటే లాభమేంటని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హనుమాన్ సినిమా ఇప్పటికీ వీక్ డేస్ లో సైతం కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా 260 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

Advertisement
Tollywood Star Heroes Need To Learn With Hanuman Movie Details Here Goes Viral

హనుమాన్ సినిమా హిందీలో సైతం అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.ఇతర భాషల్లో సైతం సరైన ప్రమోషన్స్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది.

Tollywood Star Heroes Need To Learn With Hanuman Movie Details Here Goes Viral

హనుమాన్ సినిమాలో గూస్ బంప్స్ సీన్స్( Hanuman Movie Scenes ) ఎక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.వచ్చే నెలలో ఈ సినిమా జీ5 ఓటీటీలో రిలీజ్( Zee5 OTT Release ) కానుందని సమాచారం అందుతోంది.హనుమాన్ మూవీ త్రీడీ వెర్షన్ ను త్వరలో రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

హనుమాన్ త్రీడీ వెర్షన్ కు కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హనుమాన్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు