ఇంటిని అందంగా అలంకరించుకోవడం అంటే మహిళలకు ఎంతో ఇష్టమని కచ్చితంగా చెప్పవచ్చు.అందమైన విగ్రహాలు, బొమ్మలు కొన్ని షోకేసు లో పెడుతూ ఉంటారు.
కొంతమంది జంతువుల బొమ్మలు( Animal Idols ) కూడా ఇంట్లో అందంగా అలంకరిస్తూ ఉంటారు.అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి కదా అని జంతువుల బొమ్మలు పెట్టుకోవడం వాస్తు( Vastu ) ప్రకారం సరైనది కాదని పండితులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి జంతువు ఏదో ఒక గ్రహంతో ముడిపడి ఉంటుంది.అందుకే మనం ఇంట్లో పెట్టుకునే జంతువుల విగ్రహాలు మన పై ప్రభావం చూపిస్తాయి.
కొన్ని జంతువుల విగ్రహాలు ఇంట్లో ఉంటే సానుకూల శక్తి పెరిగి ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఏ జంతువుల బొమ్మలు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే తాబేలు( Tortoise ) విష్ణుమూర్తి స్వభావం.తాబేలు క్షీరసాగర మథనం చేస్తున్న సమయంలో శ్రీమహావిష్ణువు లోక రక్షణ కోసం కుర్మావతారం ఎత్తడాని పురాణాలు చెబుతున్నాయి.విష్ణుమూర్తి తాబేలు అవతారంలో ఉన్న ఏకైక దేవాలయం శ్రీకూర్మం.తాబేలు ప్రతిమ ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి( Lakshmidevi ) ఆశీస్సులు కుటుంబం పై ఎప్పుడూ ఉంటాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఈ విగ్రహాన్ని పెట్టేందుకు తూర్పు దిశ లేదా ఉత్తర దిశ మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఏనుగు( Elephant ) జతల బొమ్మలు పెట్టుకోవడం వల్ల శుభం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ విగ్రహం పెట్టుకోవడం వల్ల కుటుంబంలో ఐక్యత, దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
వాస్తు ప్రకారం ఇంట్లో వెండి లేదా ఇత్తడి ఏనుగు ప్రతిమ పెట్టుకోవచ్చు.అలాగే ఒంటె( Camel ) పోరాటానికి, విజయానికి గుర్తుగా భావిస్తారు.ఒంటె విగ్రహం మీ ఇంట్లో ఉండడం వల్ల చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
లివింగ్ రూమ్ లో వాయువ్య దిశలో ఒంటె బొమ్మ పెట్టుకోవడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి.కెరీర్లో మంచి విజయాలను నమోదు చేస్తారు.అలాగే క్రూర జంతువుల విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదు.చాలా మంది సింహాల తలల బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటారు.
అది ఇంటికి చెడు చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.అలాగే ఇంట్లో ఆవు( Cow ) విగ్రహాన్ని ఉంచడం వల్ల సుఖసంతోషాలు, సౌభాగ్యాలు లభిస్తాయి.
LATEST NEWS - TELUGU