దేవి శ్రీని రిజక్ట్ చేసిన స్టార్ హీరో.. కారణం అదేనట?

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు.ఈయన కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్నాడు.

 Salman Khan Rejected Devi Sri Prasad, Devi Sri Prasad, Salman Khan, Bollywood, T-TeluguStop.com

ఎన్ని సినిమాలు చేసిన దేవి శ్రీ మునుపటి మ్యాజిక్ క్రియేట్ చేయలేక పోయాడు.అయితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాతో మాత్రం దేవి శ్రీ ప్రసాద్ సూపర్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా కోసం దేవి శ్రీ అందించిన మ్యూజిక్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసాడు.కేవలం తెలుగు లోనే కాకుండా పుష్ప మూవీ సాంగ్ హిందీ ప్రేక్షకులను కూడా బాగా అలరించాయి.

దీంతో ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు.రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ఈయనకు హిందీలో సైతం వరుస అవకాశాలు వచ్చినట్టు అప్పుడు పలు వార్తలు వచ్చాయి.

అయితే ఈయన ఆ తర్వాత అందించిన సంగీతం మెప్పించలేక పోతుంది.చిన్న సినిమాలకు ఈయన ఇచ్చిన మ్యూజిక్ తో పూర్తి స్థాయిలో న్యాయం చేయలేక పోయాడు.

అయితే తాజాగా దేవి శ్రీ ప్రసాద్ ను ఒక స్టార్ హీరో పక్కన పెట్టేసాడు అని వార్తలు వస్తున్నాయి.అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అని.

అతడి మ్యూజిక్ నచ్చక సినిమా నుండి తొలగించాడని అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Telugu Allu Arjun, Bollywood, Devi Sri Prasad, Pushpa, Salman Khan, Salmankhan,

ఆయన మరెవరో కాదు.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.ఈయన పుష్ప హిట్ తో దేవి శ్రీ ప్రసాద్ కు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు.

కానీ దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సల్మాన్ ఖాన్ ను మెప్పించలేక పోయాయట.సల్మాన్ ఖాన్ దేవి శ్రీ తో ఒకటో రెండో పాటలు కంపోజ్ చేయమని చెప్పారట.

అయితే ఆ పాటలు ఈయనను మెప్పించలేక పోవడంతో రిజక్ట్ చేసినట్టు బాలీవుడ్ మీడియా చెబుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube