టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల ఫేవరెట్ స్టార్ హీరోలు ఎవరో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో స్టార్ డైరెక్టర్లు ఉన్నారు.

అయితే టైర్1 డైరెక్టర్ల జాబితాలో ప్రధానంగా రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను మరి కొందరు దర్శకులు ఉన్నారు.

అయితే ఈ డైరెక్టర్లలో ఏ డైరెక్టర్ ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి.దర్శకధీరుడు రాజమౌళి( Rajamouli ) చాలామంది హీరోలతో పని చేసినా జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తన ఫేవరెట్ అని చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు రాబోయే రోజుల్లో మరికొన్ని భారీ సినిమాల దిశగా అడుగులు వేయనున్నారు.మరో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prasanth Neel ) ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కాగా ఒక సందర్భంలో ప్రశాంత్ నీల్ ఈ విషయాన్ని రివీల్ చేశారు.

మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్( Sukumar ) ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు అల్లు అర్జున్( Allu Arjun ) పేరు సమాధానంగా వినిపిస్తోంది.

Advertisement

ఈ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2, పుష్ప ది రైజ్ సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలు కమర్షియల్ గా భారీ విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం.మరో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను( Boyapati Srinu ) ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు బాలయ్య( Balakrishna ) పేరు జవాబుగా వినిపిస్తుంది.ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు భారీ హిట్లుగా నిలిచాయి.

బాలయ్య డ్యూయల్ రోల్ లో చూపించడానికి బోయపాటి ఇష్టపడతారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను( Pawan Kalyan ) త్రివిక్రమ్ ఎంతగానో అభిమానిస్తారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబు ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు.దర్శకుడు వంశీ పైడిపల్లి ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు మహేష్ పేరు సమాధానంగా వినిపిస్తుంది.

డైరెక్టర్ కొరటాల శివ ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ లను ఎంతగానో అభిమానిస్తారని తెలుస్తోంది.పూరీ జగన్నాథ్ పవన్, మహేష్, ఎన్టీఆర్ లను ఎంతగానో అభిమానిస్తారని తెలుస్తోంది.

ఆ షాట్స్ ను డైరెక్ట్ గా కాపీ కొడతాను.. వైరల్ అవుతున్న జక్కన్న సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు