కాపీ కొట్టి హిట్ అయ్యాయని ఆరోపణలు ఎదుర్కొన్న సినిమాలు ఏంటో తెలుసా?

కొంత మంది దర్శకులు హాలీవుడ్ సినిమాలు బాగా చూస్తారు.పుస్తకాలు కూడా బాగా చదువుతారు.

వాటి నుంచి ప్రేరణ పొంది ఇలాంటి సినిమాలు తాముకూడా తీయాలి అనుకుంటారు.మరికొంత మంది అవే కథలను ఉన్నది ఉన్నట్లు ఇక్కడ దింపేద్దాం అనుకుంటారు.

మొదటిది ప్రేరణ కాగా.రెండోది కాపీ అన్నమాట.

చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారు.ఒరిజినల్ వాళ్లకు క్రెడిట్ ఇవ్వకుండా స్టోరీలు, సీన్లు కాపీ కొడుతూనే ఉన్నారు.

Advertisement

మరికొంత మంది రాసుకున్న కథలు కూడా వేరే సినిమాలకు దగ్గరగా ఉంటే అది కూడా కాపీనే అంటూ ట్రోల్ చేయడం పట్ల కొందరు దర్శకులు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి.కొంత మంది సినిమా పోస్టర్ చూసే ఈ కథ నాది అంటూ రచ్చకెక్కిన సందర్భాలున్నాయి.

ప్రస్తుతం చిరంజీవి-కొరటాల చేస్తున్న ఆచార్య సినిమా విషయంలోనూ ఈ లొల్లి జరిగింది.ఈ మధ్య కాలంలో ఇలాంటి ఆరోపణలతో ఇబ్బందులు పడ్డ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఆచార్య

ఆచార్య ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే రచ్చ మొదలైంది.రాజేష్ మందూరి అనే వ్యక్తి ఈ కథ తనదేనని చెప్పాడు.

తాను మైత్రి మూవీ మేకర్స్ కి సినిమా కథ చెప్పానని.అది వారి దగ్గర నుంచి కొరటాల దగ్గరకు వెళ్లిందని ఆరోపించాడు.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

సినిమా యూనిట్ ఈ ఆరోపణలపై ఏం సమాధానం చెప్తారు అనేది తెలియాల్సి ఉంది.

పుష్ప

Advertisement

తాను ఎర్ర చందనం మీద రాసిన కథని సుకుమార్ కాపీ కొట్టి పుష్ప అనే సినిమా తీస్తున్నాడని వేంపల్లి గంగాధర్ ఆరోపణ.అయితే తాను గూగుల్ సమాచారం మేరకు సినిమా తీస్తున్నట్లు సుకుమార్ చెప్పినట్లు తెలుస్తోంది.

సాహో

ప్రభాస్ హీరోగా చేసిన ఈ సినిమా కూడా కాపీ ఆరోపణలు ఎదుర్కొంది.కొన్ని సీన్లు హాలీవుడ్ నుంచి కాపీ కొట్టినట్లు ట్రోల్స్ నడిచాయి.ఒక సాంగ్ ఆర్ట్ వర్క్ కూడా వేరే వ్యక్తివి కాపీ కొట్టినట్లు వెల్లడి అయ్యింది.

రంగస్థలం

ఎం గాంధీ అనే వ్యక్తి రాసిన ఉక్కుపాదం అనే కథని సుకుమార్ కాపీ కొట్టి తీశాడనే ఆరోపణలు వచ్చాయి.దీనిపై ఫిర్యాదు కూడా చేశారు గాంధీ.ఆ తర్వాత ఏం జరిగిందో కానీ మ్యాటర్ కూల్ అయ్యింది.

కత్తి

మింజుర్ గోపి.మురుగదాస్ కు కత్తి కథ చెప్పాడు.కొన్ని నెలల తర్వాత ఇదే కథతో మురుగదాస్ విజయ్ ని పెట్టి సినిమా తీస్తున్నాడని తెలిసి గోపి షాక్ అయ్యాడు.

ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్లాడు.

బిగిల్

శివ అనే వ్యక్తి మహిళా ఫుట్ బాల్ టీం మీద షార్ట్ ఫిల్మ్ తీశాడు.అట్లి దాన్ని బిగిల్ గా తీశాడని శివ ఆరోపించాడు.

సర్కార్

వరుణ్ రాజేంద్రన్ రాసిన సెంగోల్ స్టోరీని తీసుకుని సర్కార్ సినిమా తీశారని లొల్లి జరిగింది.చివరకు క్రెడిట్ ఇవ్వక తప్పలేదు.

తాజా వార్తలు