వ్యసనాల నుండి విముక్తి లభించాలంటే ఈ ఆలయానికి వెళ్లాల్సిందే..!

ఉత్తరాఖండ్( Uttarakhand ) కు దేవతల నిలయంగా పేరు ఉంది.ఇదో భూతల స్వర్గం అని కూడా పిలుస్తారు.

ఈ అందమైన రాష్ట్రం మొత్తం హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండడం వలన నిత్యం పర్యాటకులు ఇక్కడికి ప్రవేశిస్తూ ఉంటారు.ఉత్తరాఖండ్ ధామ్‌లు, సిద్ధ పీఠాలు మరియు దేవాలయాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది.

ఈ సిద్ధ పీఠాలలో డెహ్రాడూన్ లోని కలువాలాలో ఉన్న శ్రీ కలు సిద్ధ ఆలయం ఉంది.అయితే ఈ ఆలయంలో ఏదైనా కోరుకుంటే వెంటనే నెరవేరుతుందని అందరూ నమ్ముతారు.

స్వామి దత్తాత్రేయ యొక్క 84 మంది నిష్ణాతులైన శిష్యులలో నలుగురు డూన్ వ్యాలీలో తపస్సు చేశారని స్థల పురాణం చెబుతోంది.

To Get Rid Of Addictions, You Have To Go To This Temple.. Uttarakhand , Dehra
Advertisement
To Get Rid Of Addictions, You Have To Go To This Temple..! Uttarakhand , Dehra

అయితే ఆ నలుగురు సిద్ధ శిష్యులలో బాబా కలు సిద్ధ.అక్కడి భక్తులు బాబాకు బెల్లం ఉండలు, బాటాష, పాలు సమర్పిస్తారు.అయితే బాబాకు బెల్లం అంటే చాలా ఇష్టం.

అందుకే బాబాకు బెల్లం సమర్పించడం వలన కోరికలు తీరుతాయని అంటారు.అయితే కోరిన కోరికలు తీరిన తర్వాత కూడా భక్తులు బాబాకు బెల్లం సమర్పించాలి.

దేశ విదేశాల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు.అలాగే బాబా కూడా భక్తులు కోరిన కోరికలు తీరుస్తారు.

డెహ్రాడూన్-రిషికేశ్ రహదారిలో భనియావాలా నుండి 4 కిలోమీటర్ల దూరంలో అడవి అంచున కలపాల గ్రామంలో కలసిద్ద దేవాలయం ఉంది.

To Get Rid Of Addictions, You Have To Go To This Temple.. Uttarakhand , Dehra
సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
Victory Venkatesh : హీరోయిన్లతో గొడవ పడుతున్న స్టార్ హీరో....మాటలు కూడా లేవట?

అయితే బాబా గుడి అడవికి ఒక వైపు ఎతైన గుట్టపై ఆ గుడిని నిర్మించారు.ఆ బాబాని పూజిస్తే సంతానం కలుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వ్యసనాన్ని వదిలించుకోవడానికి కూడా ప్రజలు బాబా ఆశ్రయానికి వస్తారు.

Advertisement

ఇక ఇక్కడ 15వ శతాబ్దంలో బహిరంగ ఆకాశం క్రింద ఉన్నా కలువాలాలో ఒక స్వయం ప్రకటితో శివలింగం( Shiv Lingam ) కూడా కనిపించిందని ప్రజలు నమ్ముతారు.దీనిపై కప్పు నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలు ప్రతిసారి విఫలమవుతున్నాయని తెలిసింది.

తాజా వార్తలు