ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి.ఇంకా ఎన్నికలకు ఏడాది కూడా టైం లేకపోవడంతో ప్రధాన పార్టీల నేతలు ప్రజల మధ్య తిరుగుతూ ఎవరికి వారు తమ వ్యూహాలు వేసుకుంటున్నారు.
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) అధికారం కోల్పోకుండా అనేక జాగ్రత్తలు పడుతోంది.మరోపక్క విపక్షాలు వైసీపీ పార్టీని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నాయి.
ఈ క్రమంలో చాలా వరకు పొత్తులతో ఏపీలో అధికార పార్టీని ఎదుర్కోవాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.పరిస్థితి ఇలా ఉంటే ఏపీ బీజేపీ నేత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ( BJP party ) అధికారంలోకి రావటం గ్యారెంటీ అని అన్నారు.ఇదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఓ ప్రకటనలో తెలియజేయడం జరిగింది.
ప్రధాని మోదీ( Narendra Modi )కి ప్రపంచ స్థాయిలో ప్రజాదారణ ఉందని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాకు వైసీపీ, టీడీపీ పార్టీలు అన్యాయం చేశాయని ఆరోపించారు.
అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాగునీటి కోసం ₹7400 కోట్లు మంజూరు చేస్తే ఆ పథకాన్ని చంద్రబాబు రద్దు చేసినట్లు కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.