ఎండల దెబ్బకు ఎర్రగా కమిలి పోయిన చర్మాన్ని రిపేర్ చేసే మ్యాజికల్ రెమెడీ ఇదే!

సమ్మర్ సీజన్ ప్రారంభం అయ్యింది.మార్చి నెల నుంచి భానుడు భగభగమంటూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.

అయితే వేసవికాలంలో ఎండల దెబ్బకు ఆరోగ్యమే కాదు చర్మం సైతం పాడవుతుంటుంది.ముఖ్యంగా ఎండల కారణంగా కొందరి చర్మం ఎర్రగా కమిలి పోతుంటుంది.

ఇలా కమిలిపోయిన చర్మాన్ని మళ్లీ ఎలా మామూలుగా మార్చుకోవాలో తెలియక కొందరు మదన పడుతుంటారు.అయితే ఎండల దెబ్బకు ఎర్రగా కమిలిపోయిన చర్మాన్ని రిపేర్ చేసేందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక అరటి పండును( Banana fruit) తీసుకొని పీల్ తొలగించి సన్నగా స్లైసెస్ మాదిరి కట్‌ చేసుకోవాలి.

Advertisement
This Is The Magical Remedy To Repair Sun Damaged Skin, Sun Damaged Skin, Magical

అలాగే ఒక అవకాడో( Avocado ) ని తీసుకుని సగానికి కట్ చేసి లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో అవకాడో పల్ప్, అరటిపండు ముక్కలు వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల తేనె( honey ), వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

This Is The Magical Remedy To Repair Sun Damaged Skin, Sun Damaged Skin, Magical

ఈ మిశ్రమాన్ని అప్లై చేయడానికి ముందు చల్లటి వాటర్ లో ముంచిన క్లాత్ తో కమిలిపోయిన చర్మాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి.ఆ తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి.అనంతరం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

This Is The Magical Remedy To Repair Sun Damaged Skin, Sun Damaged Skin, Magical

అరటిపండు, అవకాడో, తేనె మరియు విటమిన్ ఈ ఆయిల్ లో ఉండే సుగుణాలు క‌మిలిపోయిన చర్మాన్ని రిపేర్ చేస్తాయి.మళ్ళీ పూర్వ స్థితికి తెస్తాయి.ఈ మ్యాజికల్ రెమెడీని సమ్మర్ లో తరచూ పాటిస్తే చర్మ ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

చర్మం తేమగా నిగారింపుగా మెరుస్తుంది.ఎండల వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.

Advertisement

కాబట్టి వేసవిలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

తాజా వార్తలు