శాస్త్రం ప్రకారం ఈ పదార్థాలను ఉచితంగా అస్సలు ఇవ్వకూడదు?

మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం కొన్ని వస్తువులను ఎలాంటి పరిస్థితులలో కూడా దానమివ్వకూడదు అని చెబుతుంటారు.

ఒకవేళ అలాంటి వస్తువులను దానం ఇచ్చినా ఎన్నో కష్టాలను కొని తెచ్చుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ విధంగా వస్తువులను దానం చేయటం వల్ల మానసిక శాంతి కొరవడుతుంది.అదే విధంగా ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇతరులకు ఏ వస్తువులను ఉచితంగా ఇవ్వడం ద్వారా ఎటువంటి కష్టాలు అనుభవిస్తామో ఇక్కడ తెలుసుకుందాం.ఉప్పు:

మన భారతీయ వంటకాలలో ఎక్కువగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఉప్పు ఒకటి.ఉప్పు మనకు సముద్రం నుంచి లభిస్తుంది.సముద్రగర్భం నుంచి సాగర మధనం చేస్తున్న సమయంలో లక్ష్మీదేవితో పాటుగా ఉప్పు కూడా లభించింది కనుక ఉప్పును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు.

Advertisement

అందుకోసమే ఉప్పును ఎటువంటి పరిస్థితులలో కూడా ఇతరులకు ఉచితంగా దానం ఇవ్వకూడదు.ఒకవేళ ఎవరికైనా ఉప్పు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే వారితో డబ్బులు తీసుకుని ఉప్పు ఇవ్వాలి.

ఈ విధంగా ఉప్పును దానం ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడటమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడతాయి.నల్ల నువ్వులు:నల్ల నువ్వులను పొరపాటున కూడా ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదు. నల్ల నువ్వులు రాహువు, కేతువు, శనికి ప్రతీక.

ఎవరికైనా నల్లనువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం తొలగిపోయి నువ్వులను తీసుకున్న వారిపై శని ప్రభావం ఏర్పడుతుంది.కనుక నువ్వులను ఇతరుల దగ్గర నుంచి ఉచితంగా తీసుకోకూడదు.

ఇనుము: ఇనుము శని దేవునికి సంబంధించిన వస్తువుగా భావిస్తారు.కనుక ఇనుమును ఎట్టి పరిస్థితులలోను ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఒకవేళ తీసుకున్నట్లయితే శని ప్రభావం మనపై పడుతుంది అదే విధంగా శనివారం ఇనుమును మన ఇంటికి తీసుకురాకూడదు.

Advertisement

సూది:

సూదిని కూడా ఇతరులకు ఉచితంగా దానమివ్వకూడదు అదేవిధంగా ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదు.సూదిని ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోవడం వల్ల మన ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.ఫలితంగా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కలహాలు తలెత్తడం వంటివి జరుగుతుంటాయి కనుక ఎలాంటి పరిస్థితులలోనూ ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదు.

అదేవిధంగా చేతిరుమాలు, వంట నూనెను ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.ఈ వస్తువులను తీసుకునేటప్పుడు కొంత మొత్తంలో నైనా డబ్బులు చెల్లించి తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రభావాలు మనపై కలగవు.

తాజా వార్తలు