రాత్రి ఆహారంలో ఇవి తీసుకుంటే సులువు‌గా బ‌రువు త‌గ్గొచ్చ‌ట‌!

ఇటీవ‌ల కాలంలో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్యతో నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.ఇక బ‌రువు ఎందుకు పెరుగుతున్నాము.

ఎలా త‌గ్గాలి అన్న విష‌యాలు తెలియ‌ని వారూ ఎంద‌రో.అయితే బ‌ర‌వు త‌గ్గాల‌నే అతి ఉత్సాహంతో చాలా మంది చేసే ప‌ని తిన‌డం మానేయడం.

అది కూడా రాత్రి పూట తిన‌డం మానేస్తారు.కానీ, ఇక్క‌డ తెలియ‌ని విష‌యం ఏంటంటే.

తిన‌డం మానేస్తే బ‌రువు త‌గ్గ‌క‌పోగా మ‌రిన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.అలా కాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే ఆహారాల‌ను రాత్రి పూట తీసుకుంటే.

Advertisement
These Foods To Eat At Night To Lose Weight! Best Foods, Eat Food At Night, Lose

సులువుగా బ‌రువు త‌గ్గొచ్చంటున్నారు నిపుణులు.మ‌రి ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

వెయిట్ లాస్‌లో చెర్రీస్ కూడా గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.అందులో ఉండే ప‌లు పోష‌కాలు శ‌రీరంలో అద‌న‌పు కొవ్వును క‌రిగిస్తాయి.

కాబ‌ట్టి, రాత్రి ఆహారంలో చెర్రీస్ తీసుకుంటే.బ‌రువు త‌గ్గ‌డంతో పాటు నిద్ర కూడా బాగా ప‌డుతుంది.

అలాగే రాత్రి ఆహారంలో ఒక చిన్న క‌ప్పు పెరుగు ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే, పెరుగులో ఉండే ప్రోటీన్ ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లిగించ‌డంతో పాటు కొవ్వును కూడా క‌రిగిస్తుంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఇక ఓట్స్ కూడా అధిక బ‌రువును నియంత్రించ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.పాలు, పెరుగు లేదా నీటిలో నానబెట్టిన ఓట్స్ ను రాత్రి ఆహారంలో తీసుకుంటే.

Advertisement

త్వ‌ర‌గా జీర్ణం అవుతాయి.మ‌రియు అందులో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.

ఫైబ‌ర్ ఉండే ఏ ఆహారం తీసుకున్నా బ‌రువు త‌గ్గొచ్చు.

బ‌రువు త‌గ్గించ‌డంలో చాక్లెట్ బ్లెండెడ్ మిల్క్ కూడా బాగా స‌హాయ‌ప‌డుతుంది.ఇందులో ఉంటే కాల్షియం పొట్ట చుట్టు ఉన్న కొవ్వును క‌రిగిస్తుంది.కాబ‌ట్టి, రాత్రి ఆహారంలో దీనిని కూడా తీసుకోవ‌చ్చు.

అలాగే బాదం కూడా బ‌రువు త‌గ్గించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.కాబ‌ట్టి, రాత్రి ఆహారం ఐదు నుంచి ఆరు వార‌కు నాన బెట్టిన బాదం తీసుకుంటే.

శ‌రీరంలో కొవ్వు క‌ర‌గుతుంది.ఇక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు రాత్రి ఆహారంలో వైట్ రైస్‌కు బ‌దులుగా గోదుమ లేదా జొన్న రొట్టెలు తినడం మంచిది.ఇక మ‌రో విష‌యం ఏంటంటే.

ఇప్పుడు చెప్పుకున్న ఆహారాలను రాత్రి 7 గంటల లోపే తీసేసుకోవాలి.మ‌రియు తిన్న రెండు, మూడు గంట వ‌ర‌కు అస్స‌లు నిద్రించ‌రాదు.

తాజా వార్తలు