ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతపై సర్వత్రా హర్షం...!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో అధికారం చేపట్టిన తొలి రోజే కాంగ్రెస్ ప్రభుత్వం,సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఉద్యమ ఆకాంక్షల అమలు దిశగా అడుగులు వేయడం శుభ పరిణామమని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉద్యమ కేసులతో పదేళ్లుగా అవస్థలు పడుతున్న ఉద్యమకారులు,వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టడం,ప్రజా దర్బార్ నిర్వహించడం,తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యమకారుల మీద పెట్టిన కేసులన్నీ బేషరతుగా ఎత్తివేతకు నిర్ణయం తీసుకోవడం ద్వారా రాబోయే కాలంలో ప్రజాపాలన వస్తుందనే నమ్మకం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డికి,కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

పలు ప్రాంతాల్లో వీధిలోకి వచ్చి స్వీట్స్ పంపిణీ చేసుకుంటూ సంబురాలు జరుపుకున్నారు.

వీడియో వైరల్‌ : మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన టీమిండియా క్రికెటర్‌

Latest Nalgonda News