వైరల్: రూ.5.65 లక్షలు పలికిన ఓ చిన్న గాలి బ్యాగ్ ధర.. అసలు ఎందుకు అంత ధరంటే..?!

సాధారణంగా చిన్న పిల్లలకు బెలూన్స్ అంటే చాలా ఇష్టం.ఆ బెలూన్స్ కూడా కేవలం ఓ 1 లేదా 2 రూపాయిలు పెడితే చాలు కొనేయవచ్చు.

గాలి నింపి అమ్ముతున్న ఆ బెలూన్ ధర 5 రూపాయలే.కానీ ఇక్కడ అదే గాలిని నింపి ఇస్తున్న ప్లాస్టిక్ బ్యాగ్ ధర తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.గాలితో నింపి ఇస్తున్న ఆ ప్లాస్టీక్ బ్యాగ్ ధర 5.65 లక్షల రూపాయలు అని చెబితే మీరు ముక్కున వేలేసుకోవడం ఖాయం.కాన్నే వెస్ట్ అనే బ్రాండ్ తాము తయారు చేసిన చిన్న ప్లాస్టిక్ బ్యాగ్ ధర ను భారీగా విక్రయిస్తోంది.

అట్లాంటా దోండా లిజనింగ్ మ్యూజిక్ ఈ వెంట్ ను కాన్వే వెస్ట్ సంస్ధ ఈ మధ్య కాలంలో అట్లాంటాలోని మెర్సిడెస్ బెంజ్ స్టేడియంలో నిర్వహించింది.దోండా మ్యూజిక్ ఆల్బమ్స్ అంటే చాలా మందికి మక్కువ.

ఎంతో మంది ఆ బ్రాండ్ బ్యాగుల కోసం పోటీ పడుతుంటారు.ఆయన మ్యూజిక్ కోసం వేలాది మంది ఈవేంట్ కు వచ్చి సంబరాలు చేసుకున్నారు.

Advertisement

ఈవెంట్ కు వచ్చిన వారిలో ఒక అభిమాని బ్యాగ్ ను వేలానికి పెట్టడం విశేషంగా చెప్పొచ్చు.ఆ వ్యక్తి తన వద్ద ఉన్నటువంటి జిప్ లాక్ ప్లాస్టిక్ బ్యాగ్ లో గాలిని నింపి ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ను ఓ ప్రముఖ ఈ- కామర్స్ సైట్ ఈబే లో విక్రయించేందుకు పెట్టాడు.

ఆ బ్యాగ్ ప్రారంభ ధరను 3,330 డాలర్లుగా ఆ వ్యక్తి నిర్ణయించాడు.అంటే అది సరిగ్గా మన కరెన్సీలో 2 లక్షల 24వేల రూపాయలుగా నిర్ణయంచి వేలం పాటను మొదలుపెట్టారు.

ప్లాస్టీక్ బ్యాగ్ లో నింపబడిన గాలి దోండా లిజనింగ్ ఈవెంట్ సమయంలో నింపిన గాలిగా నిర్దారించారు.అందుకోసం వీలుగా ఈవెంట్ సమయంలో ప్లాస్టి క్ బ్యాగ్ పట్టుకుని ఉన్న ఫోటోను కూడా వేలంపాటలో పోస్టు చేశారు.ఇటువంటి వేలం పాటకు విశేష రెస్పాన్స్ వచ్చింది.

ప్లాస్టిక్ బ్యాగ్ ను సొంతం చేసుకునేందుకు ఫ్యాన్స్ తెగ ఎగబడ్డారు.వేలంపాటలో చాలా మంది పాల్గొన్నారు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !

చివరికి కాన్యే వెస్ట్ ఫ్యాన్స్ లో ఒకరు 7,600 డాలర్లకు అంటే అక్షరాల 5 లక్షల,65,000 రూపాయలకు వేలంలో ఈ గాలిని నింపిన ప్లాస్టిక్ బ్యాగ్ ను దక్కించుకున్నాడు.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అవుతోంది.

Advertisement

తాజా వార్తలు