టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయం ముట్టడి..

కార్పొరేటు కళాశాలల పీజుల దోపిడీని అరికట్టాలి.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలి.

టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్.రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు,కార్పోరేట్ జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది.

ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేటు, కార్పొరేటు కళాశాలలు, అకాడమీల పేరుతో విచ్చలవిడిగా ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయని,ఇంటర్ విద్యకే లక్షల రూపాయలను చెల్లించే పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ ఆందోళన నిర్వహించడం జరిగింది.కార్పొరేట్ కళాశాలలో గత సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగిందని, అయినప్పటికీ ఇంతవరకు వాటిపైన చర్యలు తీసుకోలేదని అన్నారు.

ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాలు లేని కారణంగానే తల్లిదండ్రులు ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల వైపు మొగ్గుచూపడం జరుగుతుందని ఈ ప్రభుత్వం వెంటనే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని అన్నారు.గెస్ట్ అధ్యాపకులను జూనియర్ కళాశాలలో ప్రారంభమైన నెల తర్వాత నియమించడం వలన ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులు ప్రైవేటు కళాశాలలను వెళ్లడం జరుగుతుందని శాశ్వత ప్రాతిపదికన జూనియర్ అధ్యాపకుల నియామకాలు జరపాలని అన్నారు.

Advertisement

నీట్ ఎంసెట్ ఐఐటి శిక్షణల పేరుతో 2 లక్షల నుండి 5 లక్షల రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారని, అకాడమీల పేరుతో కోచింగ్ సెంటర్ల ఏర్పాటుచేసి అడ్మిషన్లు ఒకచోట తరగతులు ఒకచోట నిర్వహిస్తూ తల్లిదండ్రులను విద్యార్థులను మోసం చేస్తున్నారని అన్నారు.అధికారులు వెంటనే ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని నిబంధనలు పాటించని రద్దు చేశారు.

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ జాయింట్ సెక్రెటరీ వసుంధర కు వినతిపత్రాన్ని రాష్ట్ర కమిటీ నాయకులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News