కో-ప్యాసింజర్‌ని ట్రైన్‌లో నుంచి బయటికి తోసేసిన వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్..!

అప్పుడప్పుడు బాగా విసిగించే తోటి ప్రయాణికులు తారస పడటం సహజం.ఇలాంటప్పుడు చాలామంది ఓపిక పట్టి ఆ ప్రయాణం అయిపోయేంత వరకు కామ్‌గా ఉండిపోతారు.

మరికొంతమంది మాత్రం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక దాడి చేస్తూ ఉంటారు.కాగా వెస్ట్ బెంగాల్‌లో ఈ తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది.

ఒక వ్యక్తి వాగ్వాదం కారణంగా తోటి ప్రయాణికుడిని కదులుతున్న రైలులో నుంచి బయటకు నెట్టివేశాడు.ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని రైల్వే అధికారి ఒకరు మీడియాకి తెలిపారు.

అలానే ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని అరెస్టు చేశారు.ఈ నేరంలో మరికొంత మందికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) అనుమానిస్తున్నారు.

Advertisement
The Man Who Pushed The Co-passenger Out Of The Train. ,Train, West Bengal, Viral

ఈ సంఘటనకు సంబంధించి ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల్లోకి వెళితే.

శనివారం రాత్రి తారాపీత్‌ రోడ్‌, రాంపూర్‌హాట్‌ స్టేషన్ల మధ్య వెళ్తున్న హౌరా-మాల్దా టౌన్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో చాలామంది ఎక్కారు.వైరల్ వీడియో ప్రకారం, ఆ ప్రయాణికులలో ఒక యువకుడు, ఓ మిడిల్ ఏజ్ వ్యక్తి ఒకరినొకరు తిట్టుకొంటూ, కొట్టుకుంటూ కనిపించారు.

కాసేపటికి యువకుడు ఆ వయసు పైబడిన వ్యక్తి మళ్లీ కయ్యానికి కాలు దువ్వాడు.దాంతో కోపం వచ్చినా ఆ పెద్దాయన యువకుడిని బయటికి తోసేశాడు.

తోటి ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ ఆ యువకుడిని రైలులోంచి తోసేశానని ఆ వ్యక్తి అరెస్టయ్యాక పేర్కొన్నాడు.

The Man Who Pushed The Co-passenger Out Of The Train. ,train, West Bengal, Viral
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

హౌరా-మాల్దా టౌన్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ నుంచి బయటకు నెట్టివేయబడిన వ్యక్తి సజల్ షేక్ గా గుర్తించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.రైల్లో నుంచి కింద పడ్డ తర్వాత సజల్‌కి బాగా గాయాలయ్యాయని వెల్లడించారు.ఆ స్థితిలో ట్రాక్‌లపై నుంచి అతడిని రక్షించి రాంపూర్‌హాట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేర్పించామని వివరించారు.

Advertisement

ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని అధికారి తెలిపారు.సుండిపూర్ గ్రామానికి చెందిన షేక్ తాను సైంథియా నుంచి రైలు ఎక్కినట్లు పోలీసులకు చెప్పాడు.

తాజా వార్తలు