'ఉప్పెన' రిలీజ్ డేట్‌ వచ్చింది.. సమ్మర్‌ కు ముందు నుండే సందడే సందడి

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం కాబోతున్న వైష్ణవ్ తేజ్‌ నటించిన ఉప్పెన సినిమా గత ఏడాది ఏప్రిల్‌ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కాని కరోనా కారణంగా నిలిచి పోయింది.

ఉప్పెన సినిమాతో పాటు విడుదల అవ్వాల్సిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఇప్పటికే విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది.

ఈ సమయంలోనే ఉప్పెన సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వాలని చాలా రోజులుగా మెగా అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా కోరుతున్నారు.ఎట్టకేలకు ఉప్పెన సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది.

మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను వచ్చే నెల 12న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

Advertisement

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో ఫిబ్రవరి మరింత ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను అందించబోతుంది.సినిమా పాటలు సూపర్‌ హిట్ అవ్వడంతో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందని మెగా అభిమానులతో పాటు అంతా ఎదురు చూస్తున్నారు.భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలా అని ఎదురు చూస్తున్నాం.

ఫిబ్రవరి 12 సరైన సమయంగా తాము భావిస్తున్నట్లుగా ఈ సందర్బంగా నిర్మాతల్లో ఒకరు చెప్పుకొచ్చారు.సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి సంవత్సరం దాటింది.పాట నీ కన్ను నీలి సముద్రం సినిమా విడుదల అయ్యి కూడా ఏడాది దాటింది.

గత ఏడాది ఎక్కువ మంది విన్న పాటగా ఈ పాట నిలిచింది.కనుక సినిమా ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా విడుదల కాకుండానే హీరోయిన్‌ కృతి శెట్టికి మూడు నాలుగు సినిమా ఆఫర్లు వచ్చాయి.ఈ సినిమా ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుంది కనుకే ఆమెకు ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు.

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు