కార్తీక మాసం చివరి అయిదు రోజులు తప్పనిసరిగా ఇలా చేయండి!

అన్ని మాసాలలో కెల్లా కార్తీకమాసం పరమ పవిత్రమైనదిగా భావించి, ఆ శివకేశవులను ఎంతో భక్తి భావంతో పూజిస్తారు.

ఈ నెల మొత్తం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉపవాస దీక్షలు చేస్తుంటారు.

ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో మిగిలిన ఐదు రోజులు ఎంతో పవిత్రమైనవిగా భావించి ప్రత్యేక పూజలు చేస్తారు.అయితే మిగిలిన ఐదు రోజులు ఆ శివకేశవులను ఏ విధంగా పూజించాలో ఇక్కడ తెలుసుకుందాం.

కార్తీకమాసం చివరి అయిదు రోజులు అనగా 25 వ రోజు దశమిని పురస్కరించుకుని ఆ శివకేశవులకు అన్న సంతర్పణలు చేస్తారు.ఈ విధంగా చేయటం వల్ల మహావిష్ణువు ఎంతో ప్రీతి చెంది మనం కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడు.

ఎంతో పవిత్రమైన దశమి రోజు ఏమైనా నూతన కార్యక్రమాలు చేపట్టినా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు.కార్తీక మాసం 26 వ రోజున ఆ శివకేశవులతో పాటు, ధనానికి అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు.ఈ విధంగా కుబేరుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, ధనాభివృద్ధి కలుగుతుంది.26వ రోజు ఏకాదశి రోజున వైష్ణవాలయం లో దీపారాధన, పురాణ శ్రవణం పఠనం ఇలాంటివి చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు.కార్తీకమాసం 27 వ రోజున ద్వాదశి పర్వదినాన దామోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Advertisement
The Last Five Days Of Karthika Month Must Do This, Karthika Masam,last Five Days

ద్వాదశిరోజు అన్నదానం నిర్వహించాలి.దీని ఫలితంగా సర్వ మోక్షాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

అదేవిధంగా 28వ రోజు త్రయోదశి కావడంతో నవగ్రహ దోషాలతో బాధపడేవారు త్రయోదశి రోజున నవగ్రహాలను పూజించడం ద్వారా నవగ్రహ దోషాల నుంచి విముక్తి పొందుతారు.

The Last Five Days Of Karthika Month Must Do This, Karthika Masam,last Five Days

కార్తీక మాసం చివరి 29వ రోజు మాస శివరాత్రి కావడంతో ఆ పరమశివుడిని ప్రత్యేక పూజలతో కొలుస్తారు.29వ రోజు శివుడుకి ప్రత్యేకమైన అర్చనలు, అభిషేకాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి.

అంతేకాకుండా అకాల మృత్యువు దోషాలు కూడా తొలగిపోతాయి.ఇక చివరి రోజు అయిన 30 వ రోజు అమావాస్యను పురస్కరించుకొని అమావాస్య రోజున అన్నదానం తో పాటు, ఇతర వస్తువులను దానం చేయడం ద్వారా మన పెద్దలకు నరకబాధలు తొలగిపోయి, స్వర్గ ప్రాప్తి కలిగి సంతోషిస్తారని వేద పండితులు చెబుతున్నారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

ఈ విధంగా కార్తీక మాసం చివరి అయిదు రోజులను పూజించడం ద్వారా ఎంతో పుణ్యఫలం లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు