CSA T20 Tourney : టి20 లో అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసిన ఆ దేశ టి20 లీగ్..

క్రికెట్ లో సాంప్రదాయమైన ఆట అంటే టెస్ట్ క్రికెట్ మాత్రమే.టెస్టు క్రికెట్ ఆడాలంటే క్రికెటర్లు ఎంతో నైపుణ్యం, ఓపిక కలిగి ఉండాలి.

గత కొన్ని సంవత్సరాల నుంచి క్రికెట్ లోకి 20 ఓవర్లా ఫార్మేట్ ను ప్రవేశపెట్టినప్పటి నుంచి క్రికెట్ తీరు మారిపోయింది.టి20 ఫార్మాట్ లో బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు.కొన్ని సార్లు మాత్రమే బౌలర్లు మెరుస్తున్నా అది చాలా తక్కువ సార్లు మాత్రమే జరుగుతుంది.

తాజాగా దక్షిణాఫ్రికా దేశవాళి టోర్నీ అయిన CSA T20 టోర్నీ లో ప్రపంచ రికార్డు నమోదయింది. టైటాన్స్, నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో బ్యాటర్లు పరుగుల వరద పారించారు మొత్తం రెండు చెట్లు 40 ఓవర్లలో ఏకంగా 501 పరుగులు చేశారు.

ఒక టి20 మ్యాచ్ లో నమోదైన అత్యధిక పరుగుల రికార్డు నమోదయింది.కొన్ని సంవత్సరాల క్రితం న్యూజిలాండ్ లో జరిగిన సూపర్ స్మాష్ 2016-17 టి20 టోర్నీలో 497 పరుగులు నమోదు అయ్యాయి.

అయితే తాజాగా ఆ రికార్డును టైటాన్స్, నైట్స్ మ్యాచ్ బ్రేక్ చేసింది.

Advertisement

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 271 పరుగులు చేసింది.ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ బ్యాటర్ డివాల్డ్ బ్రెవీస్ విధ్వంసం సృష్టించాడు.కేవలం 57 బంతుల్లోనే 13 సిక్సర్లు, 13 ఫోర్లతో 162 పరుగులతో తుఫాన్ బ్యాటింగ్ చేశాడు.టి20 ఫార్మాట్ లో ఒక జట్టు చేసిన అత్యధిక పరుగుల జాబితాలో ఈ ఇన్నింగ్స్ నాలుగో స్థానంలో ఉంది.ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన నైట్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 230 పరుగులు చేసి చివరి వరకు పోరాడిన, టైటాన్స్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో బేబీ ఏపీ డివిలియర్స్ చాలా రికార్డులను బ్రేక్ చేశాడు.ఈ మ్యాచ్ లో 162 పరుగులు చేయడం ద్వారా టి20 ఫార్మాట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన మూడో బ్యాటర్ గా రికార్డును నమోదు చేశాడు.

Advertisement

తాజా వార్తలు