అష్ట ఐశ్వర్యాలు పొందాలంటే అష్ట లక్ష్మీ స్తోత్రం చదవాల్సిందే!

మన జీవితంలో ఎక్కువ కష్టాలు, సమస్యలున్నప్పుడు అవి తొలిగిపోవాలని పదే పదే మదనపడుతుంటాం.ఏం చేసైనా సరే సమస్యల నుంచి గట్టెక్కి… అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటాం.

 Asthalaskhmi Sthotram For Good Wealth Details, Astha Lakshmi Sthotram, Lakshmi D-TeluguStop.com

మనకు సమస్యలు అధికమై.మనసు బాగాలేనప్పుడు మన కష్టాల నుంచి సుఖాల వైపు మళ్ళీంచగలిగే శక్తి ఆ ఆదిమాతకే ఉంది.అష్ట కష్టాలు తొలిగి అష్టైశ్వర్యాలు పొందాలంటే అష్టలక్ష్మీ స్తోత్రం చదువుతూ అమ్మవారికి పూజ చేయాల్సిందేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అష్టలక్ష్మీ స్తోత్రం…

ఆదిలక్ష్మీ :-

సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే

మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |

పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే

జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మీ పరిపాలయ మామ్ || 1 ||

ధాన్యలక్ష్మీ:-

అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే

క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |

మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 2 ||

Telugu Ashtalaxmi, Asthalakshmi, Devotional, Dhairya Lakshmi, Dhanalakshmi, Gaja

ధైర్యలక్ష్మీ:-

జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే

సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే |

భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే

జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||

గజలక్ష్మీ:-

జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే

రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |

హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||

Telugu Ashtalaxmi, Asthalakshmi, Devotional, Dhairya Lakshmi, Dhanalakshmi, Gaja

సంతానలక్ష్మీ:-

అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే

గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |

సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||

విజయలక్ష్మీ:-

జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే

అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |

కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే

జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||

Telugu Ashtalaxmi, Asthalakshmi, Devotional, Dhairya Lakshmi, Dhanalakshmi, Gaja

విద్యాలక్ష్మీ:-

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే

మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |

నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే

జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||

ధనలక్ష్మీ:-

ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే

ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |

వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే

జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మీ రూపేణా పాలయ మామ్ || 8 ||

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube