ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారు.
కొందరు అనారోగ్యం కారణంగా మరణిస్తుంటే మరికొందరు మాత్రం ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు.ఈ నేపథ్యంలోని తాజాగా సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం చోటుచేసుకుంది.
తమిళ సినీ ఇండస్ట్రీలో నటుడు భరత్ కళ్యాణ్ భార్య ప్రియదర్శి తాజాగా తుది శ్వాస విడిచింది.పూర్తి వివరాల్లోకి వెళితే.
తమిళనాడు భరత్ కళ్యాణ్ భార్య ప్రియదర్శిని గత కొద్ది రోజులుగా అనారోగ్యం కారణంగా ఆమె కోమాలోకి వెళ్ళింది.
అయితే కోమాలో ఉన్న ఆమె తాజాగా తుదిశ్వాస విడిచింది.
అయితే ప్రియదర్శిని మరణానికి ఆమె డైట్ మార్పులే కారణం అని తెలుస్తోంది.ప్రియదర్శిని కొన్ని నెలల క్రితం పలియో అనే డైట్ ను స్టార్ట్ చేశారు.
అయితే సడన్ గా ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో ఆమె రక్తంలో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోయాయి.అలా ఆమె పరిస్థితి మూడు నెలల క్రితం సీరియస్ అవ్వడంతో ఆమెను చెన్నైలోనే ఒక ఆసుపత్రిలో చేర్పించారు.
హాస్పిటల్ లో ఆమె చికిత్స తీసుకుంటూ కోమాలోకి వెళ్లిపోయింది.
కోమాలోకి వెళ్లిన ప్రియదర్శిని తాజాగా తుదిశ్వాస విడిచింది.ఇకపోతే ప్రియదర్శిని భర్త భరత్ కళ్యాణ్ విషయానికి వస్తే.భరత్ కళ్యాణ్ మరెవరో కాదు తెలుగు తమిళం కన్నడ భాషల్లో నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కళ్యాణ్ కుమార్ తనయుడే.
మొదట్లో వెండితెర పోయి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం బుల్లితెరపై సత్తాను చాటుతున్నాడు.కాగా భరత్ కళ్యాణ్ అపూర్వ రంగల్,వంశం,జమీలా వంటి సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.