సడలింపు లు సరే మరి వీటి సంగతి ఏంటి ?

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తూ వస్తోంది.ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు.

 India Lock Down Easing In Some More Important Works, India Corona Virus, India L-TeluguStop.com

అయినా ఈ వైరస్ వ్యాప్తి రోజురోజుకు భారత్ లో పెరుగుతూనే వస్తోంది.ఈ నేపథ్యంలో మే 3వ తేదీ వరకు మరోసారి ఈ నిబంధన పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ నిబంధన కారణంగా బయటకు వచ్చే అవకాశం లేక తీవ్ర అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అత్యవసర పనుల మీద వెళ్లేవారు, వ్యవసాయ పనులు చేసుకునేవారు, దినసరి కూలీలు ఇలా అన్ని రకాల, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో కేంద్రం ఈ విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది.అయితే ఇది చాలా మందికి ఊరట కలిగించే అంశమే అయినా, నిబంధనల సడలింపు ఇవ్వడం ద్వారా మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి.

Telugu Central, Wages, Helath Dhabas, India Corona, India Lock-Political

ఇప్పటికే కొన్ని చోట్ల కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నా కొన్ని కొన్ని చోట్ల ప్రజలు ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తున్నారు.పోలీసులు పహారా ఎంతగా ఉన్నా, ఏదో రకంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అయినా కేంద్రం కొన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని మినహాయింపు ప్రకటనను ఇచ్చింది.వ్యవసాయ ఆధారిత రంగాలు అన్నింటికీ మినహాయింపు ఇస్తూ ప్రకటన చేసింది.వ్యవసాయ ఆధారిత రంగాలు అంటే డాక్టర్లు వాటి రిపేర్లు, వాటి విడి భాగాలు అమ్మే దుకాణాలు, వ్యవసాయ ఆధారితం కిందకే వస్తాయి.కేంద్రం మార్గదర్శకాలను బట్టి ఇవన్నీ తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు మార్గదర్శకాల్లో ఉంది.

ఇక భవన నిర్మాణ కూలీలకు అనుమతులు ఇచ్చారు.

Telugu Central, Wages, Helath Dhabas, India Corona, India Lock-Political

రోడ్ల పక్కన దాబాలకు కూడా అనుమతి ఇచ్చారు.అయితే వీటిలో పనిచేసే వారికి ఏ విధంగా కట్టడి చేస్తారు అనేది ఇంకా స్పష్టత లేదు.అలాగే ఆరోగ్య సమస్యల మీద సరిహద్దులు దాటేందుకు కూడా అనుమతి ఇచ్చారు.

అయితే ఆ అనుమతి ఏ విధంగా ఇస్తారు, దానికి మార్గదర్శకాలు ఏంటి అనేది పూర్తిగా క్లారిటీ లేకుండా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.కేంద్రం ఆదేశాలను బట్టి రాష్ట్రాలు వీటికి అనుమతులు ఇవ్వాలి.

కేంద్రం ఇచ్చిన సడలింపులు చూపించి పౌరులు రోడ్లపై యధావిధిగా తిరగేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. వ్యవసాయరంగానికి మినహాయింపులు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అయితే వాటి అనుబంధ రంగాలకు అనుమతులు ఇచ్చే విషయంలో కేంద్రం కొన్ని కఠినమైన మార్గదర్శకాలు విడుదల చేయకపోతే పరిస్థితి మళ్లీ అదుపు తప్పే అవకాశం లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube