అందుకే పెళ్ళికి, రంగుకు ఛార్మి దూరం.. ఎవరొచ్చినా విడాకులేనట!

ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు వయసు మీద పడిపోవడమే ఆలస్యం పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని బాగా ప్రశ్నలు ఎదుర్కొంటారు.

దాంతో తమకు ఇష్టముంటే చేసుకుంటాము అని లేదంటే ఇంకా సమయం ఉందని అంటూ కొన్ని అర్థం ఉండే సమాధానాలు చెబుతారు.

కానీ ఛార్మి మాత్రం కాస్త వెరైటీగా సమాధానం చెప్పింది.తాను పెళ్లి చేసుకుంటే మాత్రం విడాకులే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇంతకీ ఛార్మి అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చూద్దాం.టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చిన్న వయసులోనే అడుగు పెట్టింది ఛార్మి.2001లో విడుదలైన నీ తోడు కావాలి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.ఈ సినిమా తర్వాత శ్రీ ఆంజనేయ సినిమాలో నటించగా ఈ సినిమాలో తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది.

అలా ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించింది.మాస్, చక్రం, పౌర్ణమి, జ్యోతిలక్ష్మి, మంత్ర వంటి పలు సినిమాలు తనకు మంచి గుర్తింపునిచ్చాయి.ఇక ఈమె నటనకు దూరంగా ఉంటూ నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.

Advertisement
This Is Why Charmi Kaur Is Away From Marriage And Color Can Easily Divorce Deta

దీంతో ఆమెను గతంలో చాలామంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని బాగా ప్రశ్నించారు.ఇక తానే స్వయంగా మీడియా ముందుకు వచ్చి తన పెళ్లి గురించి తెలిపింది.

తాను గతంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని ప్రేమించానని తెలిపింది.కానీ అది వర్కవుట్ కాలేదట.

ఇక తన తండ్రికి తన గురించి బాగా తెలుసని.తన తండ్రి ఎప్పుడు తనతో.

నువ్వు మ్యారేజ్ మెటీరియల్ కాదు అని అంటుండేవాడని తెలిపింది.

This Is Why Charmi Kaur Is Away From Marriage And Color Can Easily Divorce Deta
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఎందుకంటే ప్రేమ లో ఉంటే ఎప్పుడూ ప్రియుడు పక్కనే ఉండాలి.అతన్ని ఎక్కువగా గారాబం చేస్తూ ఉండాలి.ఆ రెండు చేయడం నావల్ల కాదు అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది.

Advertisement

తాను ఒకవేళ పెళ్లి చేసుకున్న కూడా అవన్నీ విడాకులకు దారి తీస్తాయని తెలిపింది.ఇప్పటికీ ఆమె అదే ఉద్దేశంతో పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.

కానీ గతంలో ఈమెకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఎఫైర్ ఉందని బాగా టాక్ వినిపించింది.

2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతిలక్ష్మి సినిమా సమయంలో ఛార్మికి, పూరి జగన్నాథ్ కు మధ్య పరిచయం ఏర్పడిందని తెలిసింది.అదే సమయంలో పూరితో నిర్మాత బాధ్యతలు కూడా చేపట్టింది.ఆయన పేరు మీద ఉన్న కంపెనీలు మొత్తం తనే చూసుకుంటుంది.

అంతే కాకుండా ఆయన సినిమాలకు ప్రొడక్షన్ పనులు చూసుకుంటుంది.దీంతో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుందని.

అందుకే ఛార్మి ఆయన కోసం పెళ్లి చేసుకోలేదని తెలిసింది.

ఈ విషయం పూరి భార్యకు తెలియడంతో ఆమె నేరుగా ఛార్మి దగ్గరికి వెళ్లి వార్నింగ్ కూడా ఇచ్చిందట.పైగా వేరేవాళ్లను చూసుకొని త్వరగా పెళ్లి చేసుకో అంటూ హెచ్చరించిందట.కానీ ఛార్మి మాత్రం తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని కేవలం ఫ్రెండ్ షిప్ అని మాత్రమే ఉందని తెలిపిందట.

ఇప్పటికీ కూడా పూరి దర్శకత్వంలోనే నిర్మాతగా చేస్తుంది.ప్రస్తుతం పూరి తన దర్శకత్వంలో లైగర్ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ఛార్మినే నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.

తాజా వార్తలు