తెలుగు సంవత్సరాలు ఎన్ని? వాటి పేర్లు ఏమిటి?

సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, తెలుగు సంవత్సరాలు మొత్తం 60.వీరంతా నారదుడి కుమారులుగా పురాణాలు చెబుతున్నాయి.

 Telugu Years Calender , Devotional , Telugu Devotional , Telugu Samvathsaralu-TeluguStop.com

శ్రీ మహా విష్ణువు మాయతో నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు .అతడిని మహిళగా తయారు చేశాడట.ఆ రూపంలో ఉన్న నారదుడు ఓ రాజుని పెళ్లి చేసుకొని 60 మంది పిల్లలను కన్నాడట.ఆ తర్వాత యుద్ధంలో వీరంతా చనిపోయారట.ఆ తర్వాత మహా విష్ణువు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చారట.అలా నారదుడి 60 మంది పిల్లలు తెలుగు సంవత్సరాలుగా వర్దిల్లుతున్నారు.

అందులో మొదటిది ప్రభవ, విభవ, శుక్ల, పమోదూత, ప్రజా పతి, అంగీరస, శ్రీ ముఖ, బావ, యువ, ధాతు, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పొర్తివ, వ్వయ, నందన, విజయ జయ, మన్మద, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, సార్వరి, ప్లవ, సుబకృత్, సోభకృత్, క్రోధ, వశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సధారణ, విరోధికృత్, పరీదావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్దర్తి, రౌద్రి, దుర్మతి దుందుభి, రుదిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ.ఈ 60 సవంత్సరాల కాలంలో వారు పుట్టిన సంవత్సరం నుంచి 60 సంవత్సరాలు పూర్తవడాన్ని వలయంగా పరిగణిస్తారు.

ఇలా 60 ఏళ్లు పూర్తయిన వారు షష్టి పూర్తి చేసుకుంటారు.అరవై ఏళ్ళ తర్వాత సంవత్సర చక్రం పూర్తయినట్లే మనిషి రెండో బాల్య దశకు వస్తాడట.చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు.అకారణంగా అలగటం అవీ ఇవీ తినాలనే కోరిక కలగటం, ఎక్కువ సేపు నిద్రపోవడం, చిన్న చిన్న విషయాలకే ఆనంద పడటం.

కోపం తెచ్చుకోవడం, కన్నీళ్ళు పెట్టుకోవడం వంటి బాల్య చేష్టలన్నీ 60 తర్వాత మళ్ళీ ప్రారంభం అవుతాయి.అప్పటి నుంచి ప్రతిబిడ్డ తన తల్లి దండ్రులను బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube