ఓటిటి ప్లాట్ఫారం( OTT platform ) వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఒక కొత్త ఒరవడి సృష్టించబడింది.ఎంత పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అయినా కూడా తాను అనుకున్న విధంగా సినిమా తీయలేకపోతున్నాడు.
అందుకు ప్రధాన కారణం తను ఎలాంటి సినిమా తీయాలో ఓటిటి డిసైడ్ చేస్తుంది కాబట్టి.అందుకే యూత్ కి ఎక్కువ అవకాశాలు దొరుకుతున్నాయి.
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీని కొత్త దర్శకులు యువ డైరెక్టర్స్ మాత్రమే నడిపిస్తున్నారు.గత కొంతకాలం నుంచి సినిమాలు వారివి మాత్రమే హిట్ అవుతూ వస్తున్నాయి.
ఇక హీరోలు ఓన్లీ హీరో పాత్ర చేయకుండా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం అంటూ కొత్త కొత్త అడుగులు వేస్తూ సినిమాని మొత్తం వారి గుప్పెట్లో పెట్టుకుంటున్నారు.
తనదైన రీతిలో కొత్త యాసలో సినిమాలను తీస్తూ జనాలపైకి వదులుతూ యువ హీరోలకు దీటు లేదు అని నిరూపించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో మనం పరిశీలిస్తే విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, తరుణ్ భాస్కర్, నవీన్ పోలిశెట్టి ఇలాంటి హీరోలు అంతా కూడా హీరో పాత్ర కాకుండా సినిమాలోని అన్ని విభాగాల్లో వేలు పెట్టి ఖచ్చితంగా సినిమాను విజయవంతం చేయాలనుకుంటున్నారు.ఇప్పుడు వీరిదోవలోనే మరొక కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.తాజాగా విడుదలైన మేము ఫేమస్ ( memu famous )సినిమాకి హీరో మరియు దర్శకుడు అయినటువంటి సుమంత్ ప్రభాస్( Sumanth Prabhas ) గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్నారు.
చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్స్( Chai Biscuit Productions ) తీసిన ఈ సినిమాకి సుమంత్ ప్రభాస్ కేవలం డైరెక్షన్ మాత్రమే కాకుండా స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా అన్ని తానై నడిపించాడు.ఈ సినిమా ప్రమోషన్స్ కూడా విభిన్న రీతిలో చేయించి సినిమాకు అట్రాక్షన్ తెచ్చుకోవడంలో సుమంత్ మొదట సక్సెస్ అయ్యాడు.ఇక టాలీవుడ్ లో ప్రతి హీరో కూడా ప్రస్తుతం సుమంత్ గురించి ట్వీట్ వేసే పరిస్థితి వచ్చింది అంటే అతడు స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.నిన్న మొన్నటి వరకు కేవలం వికీపీడియాలో ఒక పేజీ కూడా లేని వ్యక్తి ఈరోజు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే స్థాయికి ఎదిగాడంటే అది కేవలం మేము ఫేమస్ సినిమా వల్ల మాత్రమే సాధ్యమైంది.
మరి ఇక ముందు ముందు ఎన్ని సినిమాలు తీస్తాడో సుమంత్ ప్రభాస్ ఏ స్థాయికి వెళ్తాడు వేచి చూడాల్సిందే.