రాజన్న సిరిసిల్ల జిల్లా :ఈనెల 28న రాజమండ్రిలో ఎన్టీఆర్ శతజయంతి దినోత్సవం సందర్భంగా జరిగే మహానాడు కార్యక్రమంను జయప్రదం చేయాలని టి ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ఏర్పాటు చేసి పేదలకు ఉపయోగపడే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదల పాలిట దేవుడయ్యారని అటువంటి మహనీయుడి శతజయంతి దినోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు.







