పాపం.. ఈ నటి అలాంటి అవకాశాల వల్లే హీరోయిన్ కాలేకపోయింది...

తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన "జయం" చిత్రంలో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ తో వచ్చేటువంటి ఓ బోల్డ్ సన్నివేశంలో నటించిన టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రవల్లిక గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే నటి ప్రవల్లికముందుగా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ కావాలని వచ్చినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల సినిమా హీరోయిన్ కాలేకపోయింది.

దీంతో కొంతమేర బోల్డ్ గా ఉన్నటువంటి వ్యాంప్ పాత్రలో కూడా అప్పుడప్పుడు కనిపించింది. అంతేగాక కొంతమేర నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే చక్కని ముఖ కవళికలు, అందం, అభినయం ఉన్నటువంటి ప్రవల్లిక ఎందుకో సినిమా హీరోయిన్ గా మాత్రం అవకాశాలను దక్కించుకోలేక పోయింది.అలాగే ఈ అమ్మడు ఎప్పుడో కొంతమేర బోల్డ్ గా ఉన్నటువంటి పాత్రలలో నటించడంతో దర్శక నిర్మాతలు ఎక్కువగా అలాంటి పాత్రలే ఆఫర్ చేశారు.

దీనికితోడు ప్రవల్లిక నటించిన చిత్రాలలో ఈమె పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఒకరకంగా చెప్పాలంటే ఈ విషయం కూడా ఆమె సినీ కెరీర్ కి మైనస్ అయ్యింది.దీంతో ప్రవల్లిక చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు మాత్రమే పరిమితమైంది.

Advertisement
Telugu Character Artist Pravallika Real Life News, Pravallika, Telugu Character

అయితే పలు ధారావాహికలలో కూడా నటించి ఇటు బుల్లితెర ప్రేక్షకులను కూడా ప్రవల్లిక బాగానే మెప్పించింది.

Telugu Character Artist Pravallika Real Life News, Pravallika, Telugu Character

అయితే ఆ మధ్య కాలంలో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో ప్రవల్లిక గత కొన్ని సంవత్సరాలుగా సినిమా పరిశ్రమ కి దూరంగా ఉంటోంది. ప్రస్తుతం నటి ప్రవల్లిక ఎక్కడుంది, ఏం చేస్తుందనే విషయాలు తెలియాల్సి ఉంది.ఏదేమైనప్పటికీ తాను నటిప్రవల్లిక తాను నటించే చిత్రాల కథలు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో ఆమె సినీ కెరియర్ ముగిసిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు