తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి4, గురువారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.48

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.55

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.6.20 ల7.00

Advertisement
Telegu Daily Astrology Prediction Rasi Phalalu January 4 Thursday 2024, Daily As

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36

మేషం:

Telegu Daily Astrology Prediction Rasi Phalalu January 4 Thursday 2024, Daily As

ఈరోజు కుటుంబమునకు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.ప్రముఖులతో పరిచయాలు సంతోషానిస్తాయి.ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు.

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.

Advertisement

వృషభం:

ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు.ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది.

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది.

మిథునం:

ఈరోజు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

నూతన వాహనయోగం ఉన్నది.వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కీలక సమయంలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి.సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.

కర్కాటకం:

ఈరోజు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు ఉన్నాయి.ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది.

ఆలయాలు సందర్శిస్తారు.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు.

కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.

సింహం:

ఈరోజు చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు.వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

దైవ దర్శనాలు చేసుకుంటారు.ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.

సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఉన్నది.

కన్య:

ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది.

కుటుంబ సభ్యులతో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

తుల:

ఈరోజు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది.

బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

దాని పరంగా ఇబ్బందులు తప్పవు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

వృశ్చికం:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి.

ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి.ఆదాయ మార్గాలు అంతంతమాత్రంగా ఉంటాయి.

చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు.దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ధనుస్సు:

ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

మకరం:

ఈరోజు ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

చిరు వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.

చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

కుంభం:

ఈరోజు వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు.

వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు.

మీనం:

ఈరోజు మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు