తెలంగాణ రాష్ట్రం ఎగ్జిట్ పోల్స్ లెక్కలు ఇవే.. అధికారంలోకి వచ్చేది ఆ పార్టీనేనా?

తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్( Telangana Polls ) ముగిసింది.ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Telangana State Elections 2023 Exit Polls Results Details, Brs, Exit Polls Resul-TeluguStop.com

సర్వేల ఫలితాలు ఊహించని విధంగా ఉన్నాయి.కామారెడ్డి ఎన్నికల్లో కేసీఆర్,( KCR ) రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఓడిపోవచ్చని బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డి ఇక్కడ గెలిచే అవకాశం ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

సీ.ఎన్.ఎన్.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ కు 56 సీట్లు, బీ.ఆర్.ఎస్ కు 48 సీట్లు, బీజేపీ 10, ఎం.ఐ.ఎం 5 స్థానాలలో గెలిచే అవకాశం ఉంది.

సీ ప్యాక్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 65,( Congress ) బీ.ఆర్.ఎస్ 41,( BRS ) బీజేపీ 4,( BJP ) ఇతరులు 9 స్థానాలలో గెలిచే ఛాన్స్ అయితే ఉంది.ఆరా మస్తాన్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 58 నుంచి 67 స్థానాలు, బీ.ఆర్.ఎస్ 41 నుంచి 49 స్థానాలు, బీజేపీ 5 నుంచి 7, ఎం.ఐ.ఎం 6 నుంచి 7, ఇతరులు 2 స్థానాలలో గెలిచే అవకాశం ఉంది.పల్స్ టుడే సర్వేలో బీ.ఆర్.ఎస్ 69 నుంచి 71 స్థానాలలో కాంగ్రెస్ 37 నుంచి 38 స్థానాలలో బీజేపీ 3 నుంచి 5 స్థానాలలో ఎం.ఐ.ఎం ఆరు స్థానాలలో ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉంది.

Telugu Congress, Exit, Kama, Kishan Reddy, Revanth Reddy, Telangana, Telangana E

చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 67 నుంచి 78 స్థానాలు, బీ.ఆర్.ఎస్ 22 నుంచి 30 స్థానాలు, బీజేపీ 6 నుంచి 9 స్థానాలు, ఎం.ఐ.ఎం 6 నుంచి 7 స్థానాలలో గెలిచే ఛాన్స్ అయితే ఉంది.న్యూస్ 18 సర్వే ప్రకారం బీ.ఆర్.ఎస్ 48 స్థానాలలో కాంగ్రెస్ 56 స్థానాలలో ఎం.ఐ.ఎం 5 స్థానాలలో గెలిచే అవకాశాలు ఉన్నాయి.ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు( Exit Polls Results ) ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయో చూడాల్సి ఉంది.

Telugu Congress, Exit, Kama, Kishan Reddy, Revanth Reddy, Telangana, Telangana E

సర్వేలు అన్నీ బీ.ఆర్.ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆ పార్టీ పాలిట వరమయ్యాయని తెలుస్తోంది.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీ.ఆర్.ఎస్ పార్టీని ఒకింత టెన్షన్ పెడుతుండటం గమనార్హం.తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మరో మూడు రోజుల్లో తేలిపోనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube