డిగ్రీ, పీజీ పరీక్షల విషయంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. !

రాష్ట్రంలో మళ్లీ మొదలైన కరోనా కాటుకు వ్యవస్ద అంతా అర్ధం కాకుండా మారుతుందట.ఇప్పటికే స్కూళ్లు ప్రారంభించి ఆ తర్వాత పాఠశాలలను మూసివేయించారు.

కానీ ఈ లోపల జరగవలసిన నష్టం జరిగింది.చాలా మంది విద్యార్ధులు, పాఠశాల సిబ్బంది కరోనా బారినపడటంతో ఉలిక్కిపడ్డ విద్యాశాఖ సెలవులు ప్రకటించింది.

ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది తెలంగాణ విద్యాశాఖ.ఎలాగైన నిర్వహిస్తామనుకున్న డిగ్రీ, పీజీ విద్యార్థుల సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తూ బుధవారం నిర్ణయించింది.

త్వరలోనే పరీక్షలకు సంబంధించి రీషెడ్యూల్ ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.కాగా పేరెంట్స్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని విద్యాసంస్థలను మూసివేయించిన విషయం తెలిసిందే.

Advertisement

అలాగే మరి కొన్ని కరోనా కఠిన నిబంధనలను అమలు చేయాలని యోచిస్తుంది.ఇకపోతే ఇటీవల గురుకుల, ఇతర పాఠశాలల్లో చదివే విద్యార్థులు కరోనా బారిన పడటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం విదితమే.

కేవలం ఆ రెండు దేశాలు మాత్రమే న్యూక్లియర్ వార్ తట్టుకోగలవా..?
Advertisement

తాజా వార్తలు