Paddy Cultivation : వరి పంట నాటు కోసం పొలాన్ని సిద్ధం చేసుకునే విధానంలో మెళుకువలు..!

మన భారతదేశంలో వరి పంట( Paddy Cultivation ) ప్రధాన ఆహార పంట.రైతులు వరి పంటలో అధిక దిగుబడులు సాధించడం కోసం సంప్రదాయ పద్ధతులను విడిచి, రసాయన ఎరువులు, రసాయన పిచికారి మందులను అధిక మోతాదులో ఉపయోగిస్తూ ఉండడం వల్ల పర్యావరణ సమతుల్యత లోపించడం, చీడపీడలకు కూడా రసాయనాలను తట్టుకునే సామర్థ్యం పెరగడం వల్ల పెట్టుబడి వ్యయం పెరిగిపోతోంది.

 Techniques In Preparing The Field For Paddy Cultivation Planting-TeluguStop.com

సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, రసాయన ఎరువులకు తక్కువ ప్రాధాన్యత ఇస్తే నేల తన సారాన్ని కోల్పోకుండా ఉండడంతో పాటు క్రమంగా పంట దిగుబడులు పెరుగుతాయి.

Telugu Agriculture, Farmers, Field, Paddy, Pilli Pesara, Urea-Latest News - Telu

వరి పంట వేయడానికి ముందు నేల యొక్క స్వభావాన్ని తెలుసుకోవడం కోసం పరీక్షలు చేయాలి.వేసవికాలంలో భూమిని లోతుగా దుక్కిదున్ని ఎండపెట్టుకోవాలి.పంట వేసే ముందు పచ్చి రొట్ట ఫైర్లు అయిన జనుము, జీలుగా, పెసర లేదంటే పిల్లి పెసర( Pilli Pesara ) లాంటివి వేసి పంట పూత దశలో ఉన్నప్పుడు బురదలో కలియదున్ని బురదలో మగ్గనివ్వాలి.

తరువాత ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలు ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా తొలగించాలి.

Telugu Agriculture, Farmers, Field, Paddy, Pilli Pesara, Urea-Latest News - Telu

ప్రధాన పొలంలో నాటుకునే నారు వయసు 25 నుంచి 30 రోజులు మించకుండా ఉండాలి.తెగులు నిరోధక ఆరోగ్యకరమైన నారును మాత్రమే ఎంపిక చేసుకోవాలి.వరి నాట్లు వేయడం ఆలస్యమైతే నారు కొనలను తుంచి నాటు వేయాలి.

వరి నాట్లు వేయడానికి వారం రోజుల ముందు రెండు నుండి మూడుసార్లు పొలాన్ని దమ్ము చేయాలి.పొలాన్ని దమ్ము చేస్తే కలుపు మొక్కలు పూర్తిగా నాశనం అవుతాయి.

చివరి దమ్ములో ఒక ఎకరానికి 50 కిలోల డిఏపి బస్తా, 10 కిలోల యూరియా( Urea ), 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేయాలి.నత్రజని ఎరువును యూరియా రూపంలో పైరు ఎరుగుదలను బట్టి రెండు నుండి మూడు సార్లు బురద పదునులో వేయాలి.

పైరు 50 నుంచి 60 రోజు మధ్య వయసులో ఉన్నప్పుడు 50 కిలోల యూరియాతోపాటు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube