నందమూరి హరికృష్ణ పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి..ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగే న్యూస్!

నందమూరి కుటుంబం నుండి కేవలం కమర్షియల్ జానర్ సినిమాలు మాత్రమే కాకుండా, కొత్తరకం స్టోరీలతో ప్రేక్షకులను అలరించాలని చూసే హీరో కళ్యాణ్ రామ్.

( Kalyan Ram ) ఆయన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు అలాంటి ప్రయోగాలు చేస్తూ వచ్చాడు.

తన తమ్ముడు ఎన్టీఆర్ లాగానే కమర్షియల్ జానర్ సినిమాలు చేస్తూ వెళ్లుంటే ఈరోజు కళ్యాణ్ రామ్ కూడా మరో స్టార్ హీరోగా ఉండేవాడు.అప్పుడప్పుడు కమర్షియల్ సినిమాలు చేసాడు, అవి సూపర్ హిట్ అయ్యాయి.

కానీ అదే ట్రెండ్ లో కొనసాగడానికి ఇష్టపడలేదు.ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతీ చిత్రం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.

గత ఏడాది భింబిసారా చిత్రం( Bimbisara Movie ) తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్, ఆ తర్వాత అమిగోస్ చిత్రం తో మన ముందుకు వచ్చాడు.ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

Tamil Hero Vijay Sethupathi In The Role Of Nandamuri Harikrishna , Bimbisara Mov
Advertisement
Tamil Hero Vijay Sethupathi In The Role Of Nandamuri Harikrishna , Bimbisara Mov

ఈ చిత్రం తర్వాత ఆయన డెవిల్( Devil ): ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే చిత్రం లో నటించాడు.ఈ నెల 29 వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రీసెంట్ గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కళ్యాణ్ రామ్ మార్క్ ఈ ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత ఆయన ఎలాగో భింబిసారా సీక్వెల్ లో చేస్తాడు.

కానీ ఆ సినిమా ప్రారంభం అయ్యే ముందే పవన్ సాదినేని తో ఒక సినిమా చెయ్యడానికి సిద్ధపడ్డాడు.ఈ స్క్రిప్ట్ కళ్యాణ్ రామ్ కోసం పవన్ రాసుకొని చాలా ఏళ్ళు అయ్యింది.

బడ్జెట్ సమస్యల కారణం గా ఈ సినిమా ఇన్నాళ్లు సెట్స్ పైకి వెళ్లలేకపోయింది.ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ చర్చల్లోకి వచ్చింది.

Tamil Hero Vijay Sethupathi In The Role Of Nandamuri Harikrishna , Bimbisara Mov
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఇందులో పవన్ సాధినేని కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ( Nandamuri Harikrishna ) గారి కోసం ఒక పవర్ ఫుల్ రోల్ ని రాసుకున్నాడట.ఇక అర్థం చేసుకోండి ఈ ప్రాజెక్ట్ ఎప్పటిదో.దురదృష్టం కొద్దీ ఇప్పుడు హరికృష్ణ గారు మన మధ్యలో లేదు.

Advertisement

ఇప్పుడు ఆయన కోసం రాసుకున్న ఆ పాత్రని ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి తో చేయించాలని అనుకున్నాడట హీరో కళ్యాణ్ రామ్.రీసెంట్ గానే పవన్ సాదినేని తో కలిసి చెన్నై కి వెళ్లి విజయ్ సేతుపతి కి కథని వినిపించగా, ఆయన ఎంతగానో నచ్చాడట.

ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలవండి డేట్స్ ఇస్తాను అంటూ హామీ ఇచ్చాడట.చూడాలి మరి ఈ క్రేజీ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతుందో లేదో అనేది.

తాజా వార్తలు