స్వర్ణగిరి ప్రసాదాలు పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కేంద్రంలోని పగిడిపల్లి వద్ద నూతనంగా నిర్మించిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని( Swarnagiri Venkateswara Swamy Temple ) పుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఎం.

సుమన్ కళ్యాణ్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతిలు గురువారం ఆకస్మికంగా సందర్శించారు.

ఆలయంలో అన్నప్రసాదాలు తయారు చేసే విభాగాలను పరిశీలించారు.ప్రసాదాలు తయారుచేసే సిబ్బందికి,యాజమాన్యానికి పలు సూచనలు చేశారు.

Swarnagiri Prasadas Were Inspected By Food Safety Officials-స్వర్ణ�

ప్రసాదాలు తయారు చేసేవారు పరిశుభ్రంగాను,తలకు టోపీ, చేతులకు గ్లౌజెస్,మూతికి మాస్కు పెట్టుకుని తయారు చేయాలన్నారు.అదేవిధంగా తయారు చేసే గది శుభ్రంగా ఉంచాలని,ప్రతిరోజు గదులను శుభ్రం చేస్తూ ఉండాలని, ఎలుకలు,బొద్దింకలు మొదలగు కీటకాలు లోపలికి రాకుండా,విస్తరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఏరోజు ప్రసాదాలు ఆరోజే చేసి విక్రయించాలని,వాటికి సరైన కవర్లు కూడా పెట్టాలని, ప్రసాదానికి వినియోగించే ముడి సరుకులను FSSAI గుర్తింపు పొందినవిగా గుర్తించి వాటిని వినియోగించాలని సూచించారు.ఎప్పటికప్పుడు వినియోగించే ఆహార పదార్థాల ఎక్సపైరీ డేట్ ను కూడా గమనించాలని,ప్రజలకు అందించే ఎలాంటి ఆహార పదార్థాలైననూ శుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉండేటట్లు చూసుకోవాలాన్నారు.

Advertisement
సాగర్ లో నీటి కుక్కల హల్చల్

Latest Video Uploads News