విద్యార్థులు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలి:డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్

సూర్యాపేట జిల్లా:విద్యార్థులు సిపిఆర్ విధానంపై అవగాహన కలిగి ఉండాలని గాయత్రీ నర్సింగ్ అధినేత,ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని వికాస్ ఫార్మసి కాలేజ్, రాయనిగూడెం నందు గాయత్రి నర్సింగ్ హోమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో విద్యార్థులకు సిపిఆర్ విధానంపై అవగాహన కార్యక్రమము నిర్వహించారు.

ఈ సంధర్బంగా విద్యార్థుల నుద్దేశించి అయన మాట్లాడుతూ మనిషి అకస్మాత్తుగా గుండెపోటుకు గురైనప్పుడు ఆరు నిమిషాల లోపల ఆక్సిజన్ ను మెదడుకు చేరవేయడం కోసం సిపిఆర్ ను నిమిషానికి 120 సార్లు చేయాలని అన్నారు.మనిషి పడిపోయిన వెంటనే చాతి మధ్యలో మన రెండు అరచేతులతో బలంగా అదమాలని,నోటి ద్వారా ఆక్సిజన్ పంపాలని అన్నారు.

ఈ సమయంలో రక్త ప్రసరణ చాలా ముఖ్యమని,కనీసం 20% రక్త ప్రసరణ జరిగినా మనిషి బ్రతికే అవకాశం వుందన్నారు.అంబులెన్స్ వచ్చిన తరువాత ఎఇడి మరియు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాలని అన్నారు.

ప్రజలు మద్యపానం, ధూమపానంకు దూరంగా వుండాలని,క్రమం తప్పకుండా వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.అనంతరం మనిషి నమూన బొమ్మతో సిపిఆర్ చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆడెపు రమేష్,డాక్టర్ మోరె కిషోర్, డాక్టర్ నీలమ్మ,డాక్టర్ స్వరూపరాణి,బూరి అశోక్ కుమార్,శివ,షణ్ముఖి, శాంతి,విద్యార్థులు పాల్గొన్నారు.

నాగ చైతన్య కి అదే మైనస్ గా మారుతుందా..?
Advertisement

Latest Suryapet News