సూర్యాపేట జిల్లా:జిల్లాలో వ్యవసాయ కళాశాల మరియు పరిశోధనా స్థానం ఏర్పాటు చేయాలని పి.డీ.
ఎస్.యు,ఏ.ఐ.ఎస్.ఎఫ్,ఆర్.వి.ఎస్.పి విద్యార్థి సంఘాల నేతలు బుధవారం మంత్రి జగదీష్ రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో వ్యవసాయ,దాని అనుబంధ రంగాలైనటువంటి ఉద్యానవన, పశుసంపద,డైరీ,మత్స్య తత్సంబంధమైన రంగాలు అభివృద్ధి చెందాలంటే తప్పకుండా జిల్లాలో వ్యవసాయి కళాశాల మరియు వ్యవసాయ పరిశోధనస్థానం ఏర్పాటు చేయాలని కోరారు.
నూతన వ్యవసాయ కళాశాల మరియు పరిశోధన స్థానం కొరకు దాదాపుగా 200 నుండి 250 ఎకరాలు ఖాళీగా ఉన్నటువంటి,నీటి వనరులు సమద్ధిగా ఉన్న ప్రాంతంలో స్థాపించవలసిన అవసరం ఎంతగానో ఉందన్నారు.శరవేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు,మనుషుల దినదినపు ఆహరపు అలవాట్ల శైలి,వ్యవసాయ రంగంలో మారుతున్న పరిస్థితులు వాటి పరిష్కారం కోసం దక్షిణ తెలంగాణా మండలం, మధ్య తెలంగాణా మండలంలో వాతావరణము, నేలలు,వర్షపాతం దగ్గర సంబంధించిన వ్యవసాయ పరిశోధనల కోసం నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో వ్యవసాయ పరిశోధన స్థానంను ఏర్పాటు చేసి వేగవంతం చేయవలసిన అవసరం ఎంతోగానో ఉందన్నారు.
కష్టపడి పంట పండించిన రైతుకు మద్దతు ధరను అందుబాటులోకి తెచ్చేవిధంగా (పంటల ప్రణాళిక)మార్కెట్ ఇంటలిజెన్స్ సెంటరు (వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా) జిల్లాలో ఏర్పాటు చేయాలని అన్నారు.ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత రైతు సోదరులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు.
వ్యవసాయి కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా వివిధ జిల్లాలు మరియు వివిధ రాష్టాలు (ICAR కోటా ద్వారా విద్యార్థిని, విద్యార్థులు ఇక్కడ ఏర్పాటు చేసిన నూతన వ్యవసాయ కళాశాలలో అడ్మిషన్ పొంది ఇక్కడి సామాజిక,ఆర్థిక,వాతావరణ స్థితిగతులపై అవగాహన పొందుతారని చెప్పారు.వ్యవసాయం ఉన్నత విద్యలో భాగమైన ఎమ్మెస్సి(అగ్రికల్చర్) పి.హెచ్ డి (అగ్రికల్చర్)లో జాతీయ స్థాయిలో ప్రవేశాలు పొంది ఇక్కడ వాతావరణనుకూలత ఆధారంగా పంటలపై పరిశోధనలు చేయటానికి ఆస్కారము ఏర్పడుతుందని తెలిపారు.వ్యవసాయ విస్తరణ విభాము,వ్యవసాయ ఆర్థిక శాస్త్రము (అగ్రికల్చర్ ఎకనామిక్స్) వంటి విభాగాలు భారత వ్యవసాయ పరిశోధనా మండలి వారి సౌజన్యంతో వివిధ ప్రాజెక్ట్ లను పొంది పంటలు,గ్రామాల్లో సర్వేలను చేసి యువత,మహిళల,రైతుసోదరులకు ఆర్థికలాభం చేకూరే విధంగా తొడప్పడుతారని వివరించారు.
పంటల సాగు,ఎరువుల మోతాను,పంటలకు నష్టం చేకూర్చే కీటకాలు,తెగుళ్లపై పరిశోధనలు,హైడ్రోపోనిక్స్ ,పట్టుపురుగుల పెంపకం,తేనె టీగల పెంపకం, వ్యవసాయ విధాన పద్ధతులపై పరిశోధనలు, పంటల సాగుపై వాతావరణ ప్రభావం పరిశోధనలు, నేల,నీరుకు సంబంధించిన పరీక్ష పలితాలు, విత్తనోత్పత్తి,సీడ్ ప్రాసెసింగ్,పుట్టగొడుగుల పెంపకం, అటవీ వ్యవసాయం,మెట్టు సాగులో మెలకువలు, సూక్ష్మసేద్యం,(బిందుసేద్యం,స్ప్రింక్లర్) వర్మి కంపోస్ట్ (వానపాముల ద్వారా సేంద్రియ ఎరువులు) సేంద్రియ వ్యవసాయంలో వాడే జీవన ఎరువులు తయారీ వాటి వాడకం,ప్రకృతి వ్యవసాయంలో వాడే వివిధ మిశ్రమాల తయారీ వాడకం,పశుగ్రాసాల పెంపకం, పశు పోషణ,పాల ఉత్పత్తి,గొర్రెలు,మేకల పెంపకం, ఉద్యాన పంటల ఉత్పత్తుల ద్వారా ఉప ఉత్పత్తుల తయారీ,రైతు సోదరులకు పంట సాగులకు ఉపయోగపడే యాంత్రికరణ పనిముట్లు,డ్రోనోటేక్నాలజీ నీటి సాగు విధానం,అగ్రి టూరిజం,ఆగ్రో ఫారెస్ట్రీ, కూరగాయలు,పండ్ల తోటలు వాతావరణంపై ఆధారపడే అంశాలు,పంటలలో వివిధ వంగడాల అభివృద్ధి,రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం,గ్రామీణ ప్రాంతాలలో యువత ఆర్థిక స్వావలంభన కొరకు చేసే కార్యక్రమాలు విజయవంతం కావాలంటే పైనా పేర్కోన్నటువంటి వివిధ అంశాలపై సమగ్రంగా అవగాహన కలిగిన అధ్యాపక,పరిశోధన శాస్త్రవేత్తలు అవసరం అని అన్నారు.ఈ ప్రాంతానికి మరియు ఇక్కడ ఉత్పత్తి అయే పంట ఉత్పత్తులు దేశ జనాభాకు ఆహరకోరత మరియు వివిధ పోషకాల కొరతను అధిగమించేందుకు విధంగా మానవులలో కలిగే వ్యాధుల దుష్ప్రభావాలు కలగకుండా ఉండే విధంగా నూతన సాగు పద్ధతులు రకాల అభివృద్ధి జరగాలంటే సూర్యాపేట జిల్లాకి వ్యవసాయ కళాశాల, పరిశోధన స్థానం ఏర్పాటు చేయాలిని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి ఇచ్చిన వినతిపత్రం లో పొందుపర్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పి.డీ.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేబొయిన కిరణ్,ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గోపగాని రవి,ఆర్.వి.ఎస్.పి రాష్ట్ర అధ్యక్షుడు బంటు సందీప్,విద్యార్థి సంఘ నాయకులు చామకూరి మహేందర్,సాయి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy