రాక్షసులకు, దేవతలకు మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరిగేవి.రోజురోజుకీ దేవుళ్ల శక్తి సన్నగిల్లుతూ.
రాక్షసులు మరింత బలవంతులయ్యారు.ఇక వారి బాధలు తట్టుకోలేక దేవతలు అందరూ కలిసి శ్రీ మహా విష్ణువు వద్దకు వెళ్తారు.
వారిని భరించలేక పోతున్నాం ఏదో ఒక సాయం చేయమంటారు.అప్పుడు మహా విష్ణువు దేవతలకు క్షీర సాగర మథనాన్ని చిలకమని చెబుతాడు.
అలా చిలకగా వచ్చిన అమృతాన్ని తాగితే మీరు మరణం ఉండదని.రాక్షసుల కంటే ఎక్కువ శక్తివంతులు అవుతారని వివరిస్తాడు.
కానీ ఇది పాల సముద్రాన్ని చిలకడం అంత సులభం కాదని వివరిస్తాడు.ఇందుకు రాక్షసుల సాయం కూడా కావలంటాడు.
అందుకోసం మీరంతా వారితో సఖ్యంగా ఉండాలని శ్రీ మహా విష్ణువు చెబుతాడు.దేవతలు ఓ వైపు.
రాక్షసులు మరో వైపు ఉండి… చిలకమంటాడు.ఇందుకోసం మంద గిరిని కవ్వంగా వాడమని… వాసుకిని తాడుగా వాడమని సెలవిస్తాడు.
దాని నుంచి అమృతం పుట్టాక మీరే తాగేయండి వారికి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని దక్కనివ్వవద్దని సూచిస్తాడు.కానీ రాక్షసుల చెంతకు వెళ్లలేక దేవతలు వెళ్లిపోతారు.
ఇలా కాలం గడుస్తుండగా… కొంతమంది రాక్షసులు దేవతలను సంహరించేందుకు వస్తారు.ఆ వార్త తెలిసిన బలి చక్రవర్తి వారిని వద్దని వారిస్తాడు.
వీరిని చంపితే మీకేం రాదని… క్షీర సాగర మథనం చిలికితే అమృతం పుడుతుందని తెలుపుతాడు.అలా వచ్చిన అమృతాన్ని తాగితే మీకు మరణమే ఉండదంటాడు.
బలి చక్రవర్తి మాటతో ప్రేరేపితులైన రాక్షసులు క్షీర సాగర మథనం చిలికేందుకు దేవతలకు సహకరిస్తారు.