బాలయ్య టపాసులాంటివాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అరవింద్!

స్టార్ హీరో బాలకృష్ణ ఇప్పటివరకు వెండితెరకే ఎక్కువగా పరిమితం కాగా తన శైలికి భిన్నంగా ఆహా ఓటీటీలో టాక్ షో చేస్తున్నారు.

అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే పేరుతో ప్రసారం కానున్న ఈ టాక్ షోపై మంచి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

ఆహా ఓటీటీకి రోజురోజుకు ప్రేక్షకాదరణ పెరుగుతుండగా వెండితెరపై హిట్టైన సినిమాలను కొనుగోలు చేసి ఆహా నిర్వాహకులు ఆ సినిమాలను ఓటీటీలో రిలీజ్ కానున్నారు.లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటు మరికొన్ని సినిమాలు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆహా ఓటీటీకి సంబంధించిన ఈవెంట్ జరగగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆహాలో దీపావళి పండుగకు పేలనున్న పాంచ్ పటాకా అన్ స్టాపబుల్ అని చెప్పారు.టాక్ షో గురించి చర్చ జరగగా టీమ్ సభ్యులు వేర్వేరు పేర్లు చెప్పారని అయితే తాను మాత్రం బాలకృష్ణ అయితే బాగుంటుందని చెప్పానని అల్లు అరవింద్ అన్నారు.

Star Producer Allu Aravind Shocking Comments About Balakrishna, Allu Aravind ,

బాలయ్యకు కాల్ చేసి ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? అని అడగగా అవుట్ డోర్ షూటింగ్ లో ఉన్నానని బాలయ్య చెప్పారని ఆహా చూస్తుంటారా? అని అడగగా చూస్తుంటానని బాలయ్య బదులిచ్చారని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.సమంత టాక్ షో గురించి అడగగా టాక్ షో చూశానని బాగుందని బాలయ్య చెప్పారని అల్లు అరవింద్ పేర్కొన్నారు.ఆ తర్వాత అన్ స్టాపబుల్ కాన్సెప్ట్ విని బాలయ్య ఓకే చెప్పారని అల్లు అరవింద్ వెల్లడించారు.

Star Producer Allu Aravind Shocking Comments About Balakrishna, Allu Aravind ,
Advertisement
Star Producer Allu Aravind Shocking Comments About Balakrishna, Allu Aravind ,

అన్ స్టాపబుల్ షో చేస్తే బాగుంటుందని బాలయ్యకు అనిపించిందని వెంటనే ఆయన ఓకే చెప్పారని అల్లు అరవింద్ పేర్కొన్నారు.బాలయ్య టపాసులాంటివాడని బాలయ్య అంత సులువుగా అన్ స్టాపబుల్ షోకు ఓకే చెబుతారని తాను అనుకోలేదని అల్లు అరవింద్ అన్నారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు