వామ్మో.. టాక్ షోకు సమంత అంత తీసుకుంటోందా..?

Star Heroine Samantha Remuneration For Samantha Sam Jam Talk Show, Sam Jam Talk Show, Samantha Remuneration, Aha Ott Platform,samantha Talk Show, Allu Aravind

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో హీరోయిన్ సమంత శైలి మిగతా హీరోయిన్లకు భిన్నం.ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించగల ప్రతిభ సమంత సొంతం.

 Star Heroine Samantha Remuneration For Samantha Sam Jam Talk Show, Sam Jam Talk-TeluguStop.com

అందం, అభినయం పుష్కలంగా ఉన్న సమంత మామ నాగార్జున అందుబాటులో లేని సమయంలో బిగ్ బాస్ షోకు హోస్ట్ గా కూడా వ్యవహరించి ప్రశంసలు అందుకుంది.సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న సమంత ఆహా ఓటీటీ కోసం స్పెషల్ టాక్ షో హోస్ట్ గా వ్యవహరించనుంది.

ఈ టాక్ షో ద్వారా సమంత పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయనుందని తెలుస్తోంది.“సామ్ జామ్” పేరుతో నవంబర్ 13వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో టాక్ షో ప్రసారం కానుంది.అయితే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత టాక్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెమ్యునరేషనే కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఒక్కో ఎపిసోడ్ కు సమంతకు 40 లక్షల చొప్పున ఇస్తున్నారని.

సినిమాలతో పోలిస్తే ఎక్కువ మొత్తం సమంతకు టాక్ షో ద్వారా దక్కనుందని సమాచారం.

పెళ్లి తర్వాత అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో సినిమాల్లో నటిస్తున్న సమంత అన్ని రంగాల్లో అడుగు పెడుతూ సత్తా చాటుతోంది.

మామ నాగార్జున బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుంటే కోడలు పిల్ల సమంత టాక్ షోల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.సమంత నిన్న సామ్ జామ్ షో గురించి మాట్లాడుతూ నటించడంతో పోలిస్తే హోస్టింగ్ చాలా కష్టమని తెలిపారు.
ఈ షో ద్వారా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు సమాజంలోని సమస్యలను వెలుగులోకి తెస్తామని ఇది కేవలం టాక్ షో అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్టేనని సమంత చెబుతున్నారు.`నో ఫిల్టర్ విత్ నేహా`, `కాఫీ విత్ కరణ్` తరహాలో ఈ షో ఉండనుందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube