ఆ సినిమా కథ విని ఏడ్చేశాను.. రజనీకాంత్ కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించి దీపావళి కానుకగా తమిళంలో అన్నాత్తే, తెలుగులో పెద్దన్న పేరుతో విడుదలైన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే.

నెగిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయని తమిళ మీడియాలో ప్రచారం జరిగింది.

ఈ సినిమా గురించి రజినీకాంత్ తాజాగా హూట్ అప్లికేషన్ ద్వారా అభిమానులతో కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు.తను హీరోగా నటించిన పెట్టా మువీ , శివ డైరెక్షన్ లో అజిత్ హీరోగా నటించిన విశ్వాసం మూవీ ఒకే సమయంలో రిలీజయ్యాయని రజనీకాంత్ అన్నారు.

తన పెట్టా మూవీతో పాటు విశ్వాసం సినిమా కూడా విజయాన్ని అందుకుందని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.విశ్వాసం సినిమాను చూడాలని తాను అనుకున్నానని విశ్వాసం సినిమా ప్రొడ్యూసర్ సత్యజ్యోతి త్యాగరాజన్ తన కోసం స్పెషల్ స్క్రీనింగ్ ను ఏర్పాటు చేశానని రజనీకాంత్ వెల్లడించారు.

ఇంటర్వెల్ వరకు విశ్వాసం మూవీ తనకు చాలా ఆసక్తిని కలుగజేసిందని అయితే ఆ సినిమా ఆ రేంజ్ సక్సెస్ ను ఏ విధంగా అందుకుందో తనకు అర్థం కాలేదని రజనీకాంత్ అన్నారు.

Star Actor Rajinikanth Shocking Comments About Annatthe Movie Details, Annatthhe
Advertisement
Star Actor Rajinikanth Shocking Comments About Annatthe Movie Details, Annatthhe

అయితే విశ్వాసం మూవీ ప్రీ క్లైమాక్స్ ను చూసిన తర్వాత తనకు ఆ సినిమా విషయంలో నెలకొని ఉన్న డౌట్స్ అన్నీ పటాపంచలు అయ్యాయని రజనీకాంత్ కామెంట్లు చేశారు.ఆ తర్వాత డైరెక్టర్ శివను కలిశానని రజనీకాంత్ పేర్కొన్నారు.

Star Actor Rajinikanth Shocking Comments About Annatthe Movie Details, Annatthhe

12 రోజులలో అన్నాత్తే కథను దర్శకుడు పూర్తి చేశారని రజనీకాంత్ అన్నారు.అన్నాత్తే మూవీ కథను విన్న తర్వాత ఏడుస్తూ డైరెక్టర్ ను కౌగిలించుకున్నానని రజినీకాంత్ చెప్పుకొచ్చారు.ఫ్యామిలీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను అన్నాత్తే కథ నచ్చిందనే విషయం తెలిసిందే.

రజనీకాంత్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు