Rajamouli Hit 2 : హిట్ 2 ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరుకానున్న స్టార్ డైరెక్టర్?

ఎన్నో విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఈయన ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇకపోతే తాజాగా మేజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న అడివి శేష్ తాజాగా హిట్ సీక్వెల్ చిత్రం హిట్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాతగా వైజాగ్ లో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం హిట్ 2 డిసెంబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నేడు సాయంత్రం హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు.

Ss Rajamouli As Cheif Guest For Hit 2 Pre Release Event ,hit 2, Adivi Sesh, Hero

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.ఎస్ రాజమౌళి హాజరుకానున్నట్లు సమాచారం.ఇకపోతే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలియజేశారు.

Advertisement
Ss Rajamouli As Cheif Guest For Hit 2 Pre Release Event ,hit 2, Adivi Sesh, Hero

హిట్ సినిమాలో హీరో విశ్వక్ , రుహాని శర్మ జంటగా నటించగా హిట్ 2 లోమాత్రం విశ్వక్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్లు, ట్రైలర్ టీజర్ సినిమా పై భారీ అంచనాలను పెంచాయి.

మరి ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు