Srikanth Daughter Medha: హీరోయిన్ల కన్నా అందంగా ఉన్న శ్రీకాంత్ కూతురు.. లేటెస్ట్ ఫోటోలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి హీరో నటుడు విలన్ శ్రీకాంత్( Srikanth ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఒకప్పుడు ఎన్నో సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న హీరో శ్రీకాంత్ ప్రస్తుతం విలన్ గా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇటీవలే విడుదలైన కోటబొమ్మాలి సినిమాతో( Kotabommali Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో విలన్ గా అదరగొట్టడంతో అప్పటినుంచి శ్రీకాంత్ ఎక్కువగా విలన్ క్యారెక్టర్లే వస్తున్నాయి.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లకు అలాగే ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు శ్రీకాంత్.

అందులో భాగంగానే తాజాగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని( Sri Venkateswara Swamy ) తన ఫ్యామిలీతో కలిసి సందర్శించారు హీరో శ్రీకాంత్.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీకాంత్ తన భార్య ఊహ,( Ooha ) కొడుకు రోషన్,( Roshan ) కూతురు మేధాతో( Medha ) కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, టీటీడీ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ప్రస్తుతం నేను దేవర, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటిస్తున్నాను.

ఇక ఈ ఏడాది అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు.ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.ఇందులో శ్రీకాంత్ కూతురు మేధ( Srikanth Daughter Medha ) హాట్ టాపిక్ గామారింది.

ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో ఎంతో అందంగా కనిపించింది.తల్లి పోలికలతో ఉన్న మేధ హీరోయిన్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయని అంటున్నారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ప్రస్తుతం హాట్ హీరోయిన్స్ గా చెలామణీ అవుతున్న హీరోయిన్స్ కన్నా మేధ అందంగా ఉందని, హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వడానికి సరిగ్గా సరిపోతుందని చెప్పుకొస్తున్నారు.ఇక మేధా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హీరోయిన్లు కూడా పనికిరారు అంతా అందంగా ఉంది.

Advertisement

హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే సక్సెస్ అవ్వడం ఖాయం అంటూ కొందరు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు