ఏకంగా 900 చిత్రాలు...అయిన కూడా శ్రీహ‌రి భార్య శాంతి క‌ష్టాలు చూడండి

రియల్ స్టార్ శ్రీహరితెలుగు సినిమా పరిశ్రమలో అద్భుత నటుడు.హైదరాబాద్ బస్తీలో పుట్టి పెరిగి చక్కటి నటుడుగా మెప్పించిన వ్యక్తి.

విలన్, కెమెడియన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు ఏ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయే వ్యక్తి తను.తన మంచి నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.కేవలం 49 ఏండ్లకే ఆయన అనుకోకుండా ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

ఆయన మరణం తర్వాత తన కుటుంబ తీవ్ర ఇబ్బందులకు గురయ్యింది.తన భార్యతో పాటు పిల్లలు మానసిక ఆవేదనకు గురయ్యారు.

తాజాగా ఆయన భార్య డిస్కోశాంతి ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో శ్రీహ‌రికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. శ్రీహ‌రి బతికి ఉన్నప్పడు ఆయన ఇంటికి సినిమా రంగానికి చెందిన వారే కాదు బ‌యట వ్య‌క్తులు వ‌చ్చి ఏ స‌హాయం కావాల‌న్నా తను చేసే వాడని చెప్పింది.సినిమాలు చేయడం ద్వారా వచ్చిన డబ్బును చాలా వరకు సేవా కార్యక్రమాలకే పెట్టేవాడని వెల్లడించింది.

Advertisement

సమాజానికి తన వంతు సాయం చేయడాన్ని శ్రీహ‌రి ఎంతో గౌరవంగా ఫీలయ్యేవారని చెప్పింది.

శ్రీహ‌రి మ‌ర‌ణంతో డిస్కోశాంతి తీవ్ర నిరాశ‌లోకి జారుకున్నారు.ఆర్థికంగా కూడా పలు క‌ష్టాలు వచ్చాయి.శ్రీహరి మరణం తర్వాత ఆమె ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పింది.

శ్రీహ‌రి, డిస్కో శాంతి దంప‌తుల‌కు ఇద్ద‌రు అబ్బాయిలు.ప్ర‌స్తుతం ఆమె తన పిల్లలతో పాటు చెన్నైలో నివాసం ఉంటోంది.

తాజాగా శ్రీహ‌రి పెద్ద కొడుకు మేఘాంశ్ శ్రీహ‌రి రాజ్‌దూత్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు.అటు డిసస్కో శాంతి శ్రీహ‌రిని పెళ్లి చేసుకోక‌ ముందు మంచి హీరోయిన్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
Hair winter : వింటర్ లో ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవాల్సిందే.. మిస్ అయితే చాలా నష్టపోతారు!

ఎన్నో స్పెషల్ సాంగులు చేసింది.ఘ‌రానా మొగుడు సినిమాలో బంగారు కోడిపెట్ట సాంగ్‌కు ఆమె చిరంజీవితో పోటీప‌డి మ‌రీ డ్యాన్స్ చేసి అబ్బుర పరిచింది.

Advertisement

ఆమె సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలు భాష‌ల్లో 900కు పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది.మంచి నటిగా గుర్తింపు పొందింది.

అనంతరం శ్రీహరిని పెళ్లి చేసుకుంది.

తాజా వార్తలు