నేటి నుంచి సావరింగ్‌ గోల్డ్‌ బాండ్స్‌ విక్రయాలు!

సార్వభౌమ బంగారం పథకం.దీన్ని సావరింగ్‌ గోల్డ్‌ బాండ్స్‌ స్కీం అని కూడా అంటారు.

దీని ద్వారా గోల్డ్‌ బాండ్స్‌ విక్రయిస్తారు.ఇవి బ్యాంకులు, నిర్ధేశించిన పోస్టాఫీస్‌లు, గుర్తింపు పొందిన స్టాక్‌ మార్కెట్ల ద్వారా విక్రయిస్తారు.

సావరింగ్‌ బంగారం బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌ను ఆగస్టు 30 నుంచి ఐదు రోజులపాటు విక్రయిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది.ఈ సావరింగ్‌ గోల్డ్‌ బాండ్స్‌ పథకంలో 2021–22కు గాను సిరీస్‌ 6తో ఇష్యూ ధర గ్రాముకు రూ.4,732గా నిర్ణయించారు.సెంట్రల్‌ గవర్నమెంట్‌ నేతృత్వంలో ఆర్‌బీఐ ఈ ధరలను ప్రకటించింది.

భారతీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన అధికారిక హ్యాండిల్లో ఈ సావరింగ్‌ పథకం గురించి వివరించింది.ఎస్‌బీఐ వినియోగదారులు ‘ఈ సర్వీసెస్‌’లో ఉండే http://onlinesbi.co.in ద్వారా కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

గోల్డ్‌ బాండ్స్‌ పథకం.

సావరింగ్‌ గోల్డ్‌ బాండ్స్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం గోల్డ్‌ మానిటైజేషన్‌లో భాగంగా 2015లో ప్రారంభించింది.

Advertisement
Sovereign Gold Bond Scheme Opens Today, 916 Gold, Bse Sensex, Reserve Bank Of In

ఈ ప£ý కంలో జీఓఐతో సంప్రదించి ఆర్‌బీఐ ద్వారా సబ్‌స్రిప్షన్‌ ఓపెన్‌ చేస్తారు.ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు పథకం కోసం నిబంధనలు, షనరతులు తెలియజేస్తుంది.ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రతి దరఖాస్తుదారుడు పాన్‌ నంబర్‌ కలిగి ఉండటం తప్పనిసరి కాబట్టి ప్రతి దరఖాస్తుతోపాటు ఇన్వెస్టర్‌కు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పాన్‌ నంబర్‌ను కలిగి ఉండాలి.

Sovereign Gold Bond Scheme Opens Today, 916 Gold, Bse Sensex, Reserve Bank Of In

ఎక్కడ కొనాలి?

ఈ బాండ్లు అన్నీ బ్యాంకుల్లో (చిన్న ఫైనాన్స్‌ సంస్థలు తప్ప), స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, పోస్టాఫీస్‌లు, గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్సె ్చంజ్, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో విక్రయిస్తారు.ప్రతిగ్రాముపై రూ.50 డిస్కౌంట్‌తో ప్రభుత్వం అందిస్తోంది.ఇది కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుంది.అటువంటి కస్టమర్లకు గోల్డ్‌ బాండ్స్‌ ధర గ్రాముకు రూ.4,682గా ప్రభుత్వం నిర్ణయించింది.ఈ గోల్డ్‌ బాండ్స్‌కు మెచూరిటీ సమయం 8 ఏళ్లు.

కానీ, ఐదేళ్ల తర్వాత బాండ్స్‌ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది.

Sovereign Gold Bond Scheme Opens Today, 916 Gold, Bse Sensex, Reserve Bank Of In

ఈ పథకానికి అర్హులు.

భారత్‌లో నివసించే ఏ వ్యక్తి అయినా, హిందూ అవిభక్త కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, సార్వభౌమ గోల్డ్‌ బాండ్‌ పథకానికి అర్హులే!

ధరలు ఎలా నిర్ణయిస్తారు?

భారతీయ రూపీ ఆధారంగా వీటి ధరలను నిర్ణయిస్తారు.సబ్‌స్క్రిప్షన్‌ గడువుకు ముందు వారంలో చివరి మూడు దినాల్లో ఇండియన్‌ బులియన్, జువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ గోల్డ్‌ ప్యూరిటీ 999 ఆధారంగా భారతీయ రూపాయిల్లో నిర్ణయిస్తారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
పెద్ద ప్లానే.. స్టూడెంట్స్‌ను స్కూల్‌ రప్పించేందుకు టీచర్లు మాస్టర్ ప్లాన్ వేసారుగా!

కనిష్టంగా ఒక గ్రాము నుంచి గరిష్టంగా వ్యక్తి అయితే 4 కేజీల వరకు, ట్రస్టులు 20 కేజీల వరకు కొనుగోళ్లు చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు