కోవిడ్ తర్వాత దక్షిణాఫ్రికాకు పెరుగుతున్న భారతీయ పర్యాటకులు.. 2023పై ఎన్నో ఆశలు..!!

కరోనా దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైన రంగం పర్యాటక రంగం.ఫస్ట్‌, సెకండ్ వేవ్స్‌ ఆ తర్వాత ఒమిక్రాన్‌ల కారణంగా టూరిజం కుదేలైంది.

దీంతో పర్యాటక రంగంపై ఆధారపడి జీవించే హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్, గైడ్‌లు ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.అయితే కోవిడ్ శాంతిస్తూ వుండటంతో ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ పర్యాటకులు పలు దేశాల సందర్శనకు వెళ్తున్నారు.

ఇదిలావుండగా.చాలా దేశాల ఆర్ధిక వ్యవస్థలకు భారతీయులు మహారాజ పోషకులు.

పర్యాటకం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైద్యం కోసం ఆయా దేశాలకు వెళుతూ వుంటారు.ఆంక్షల నేపథ్యంలో భారత్ నుంచి ప్రయాణాలు నిలిచిపోవడంతో కొన్ని దేశాలు విలవిలలాడుతున్నాయి.

Advertisement

ఇందులో దక్షిణాఫ్రికా కూడా ఒకటి.

ప్రస్తుతం ఆంక్షలు ఎత్తివేయడంతో భారతీయులు దక్షిణాఫ్రికాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలకు వెళ్తున్నారు.గతేడాది నవంబర్ వరకు 50 వేల మంది భారతీయులు దక్షిణాఫ్రికాను సందర్శించారని అంచనా.తద్వారా ఆ దేశం నిర్దేశించుకున్న 33,900 లక్ష్యాన్ని అధిగమించినట్లయ్యింది.

ఈ ఏడాది దానిని 72 శాతం మేర అధిగమించాలని దక్షిణాఫ్రికా టూరిజం శాఖ భావిస్తోంది.సౌతాఫ్రికాకు ఆరవ అతిపెద్ద విదేశీ మార్కెట్‌గా భారత్ నిలిచింది.

కోవిడ్ తర్వాత ప్రయాణ నిబంధనలను సడలించిన నేపథ్యంలో మరింత మంది భారతీయ పర్యాటకులను ఆకట్టుకోవాలని ఆ దేశం చూస్తోంది.దీనిలో భాగంగా దక్షిణాఫ్రికా టూరిజం బోర్డ్ ఫిబ్రవరి 11 నుంచి 12 వరకు ఢిల్లీలోని సాకేత్‌లో వున్న డీఎల్ఎఫ్ మాల్‌లో ఈవెంట్‌లు నిర్వహించింది.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

దీనికి కొనసాగింపుగా ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు దేశంలోని ప్రధాన నగరాలైన కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, ముంబైలలో రోడ్ షోలు నిర్వహించనుంది.

Advertisement

పర్యాటకానికి మరింత ఊతమిచ్చేలా కనెక్టివిటీ, ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా పెంచాలని దక్షిణాఫ్రికా టూరిజం బోర్డ్ నిర్ణయించింది.ఇప్పటికే ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్, ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్, కెన్యా ఎయిర్‌వేస్, ఎయిర్ సీషెల్స్‌తో సహా అనేక విమానయాన సంస్థలు భారత్-దక్షిణాఫ్రికాల మధ్య సర్వీసులను అందిస్తున్నాయి.కోవిడ్ 19 వ్యాప్తికి ముందు.

భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు ఏడాదికి 1,00,000 మంది టూరిస్టులు వచ్చేవారు.అలాగే 80,000 మందికి పైగా దక్షిణాఫ్రికా పర్యాటకులు భారత్‌లో పర్యటించారని గణాంకాలు చెబుతున్నాయి.

తాజా వార్తలు