భూ కబ్జాలకు పాల్పడుతు అక్రమ లేఔట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న సిరిగిరి రమేష్ రిమాండ్ కి తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా :భూ కబ్జాలు చేస్తూ అక్రమ లేఔట్లు సృష్టించి అమ్మడం,అనుమతి లేకుండా ప్లాట్స్ చేసి అమ్మడం వంటి మోసాలకు పాల్పడుతున్న సిరిగిరి రమేష్ పై గురువారం రోజున కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు వేములవాడ పట్టణ సి.

ఐ వీరప్రసాద్ తెలిపారు.

ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ.వేములవాడ పట్టణం చంద్రగిరి గ్రామ పరిధిలోని తెట్టేకుంట కి చెందిన చెన్నామనేని వెంకటేశ్వర్లు దగ్గర సిరిసిల్ల( Sircilla) పట్టణానికి చెందిన సిరిగిరి రమేష్ అనే వ్యక్తి సమారు రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసి అతని వృద్ధాప్యన్ని ఆసరాగా తీసుకొని అసలు ఉనికిలో లేని ప్లాట్లను సృష్టించడమే కాకుండా చెన్నామనేని వెంకటేశ్వర్లు పక్కన ఉన్న చెన్నామనేని జగన్మోహన్ భూమిలోకి అక్రమంగా చొరబడి రోడ్డుగా ఉన్న భూమిని లేఔట్ చేసి అమ్మడం, పర్మిషన్ లేకుండా ప్లాట్స్ చేసి అమాయక ప్రజలకు అమ్మి మోసపురితాముగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడనే పిర్యాదుల మేరకు సిరిగిరి రమేష్ పై వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్( Vemulawada Town Police Station ) లో కేసు నమోదు చేసి ఈ రోజు రిమాండ్ కి తరలించినట్లు పట్టణ సి.ఐ తెలిపారు.ప్రజలకు విజ్ఞప్తి సిరిగిరి రమేష్ చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే సబంధిత పోలీస్ స్టేషన్ల లో పిర్యాదు చేయాలని పట్టణ సి.ఐ వీరప్రసాద్ తెలిపారు.

Sirigiri Ramesh, Who Is Involved In Land Grabs, Creating Illegal Layouts And Com

Latest Rajanna Sircilla News