సింగం సిరీస్ లో నెక్స్ట్ మూవీ ఫిక్స్... ఆగష్టు నుంచి షూటింగ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్ అంటే వెంటనే సింగం సిరీస్ గుర్తుకొస్తుంది.

ఈ సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు సూర్యకి కూడా తమిళ్ తో పాటు తెలుగులో మంచి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చాయి.

ఇప్పటి వరకు ఈ సిరీస్ లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి.ఇప్పుడు సింగం4కి రంగం సిద్ధం అవుతుంది.

సూర్య, హరి కాంబినేషన్ లో నెక్స్ట్ సినిమాకి ఎప్పుడో ప్లాన్ చేశారు.సింగం సిరీస్ లో కాకుండా కంప్లీట్ కొత్త కథతో ఈ సినిమా చేయాలని భావించారు.

అయితే ఫాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ అనేసరికి సింగం సిరీస్ లో భాగంగానే నెక్స్ట్ సినిమా కూడా కావాలని ఎక్కువగా కోరుకోవడంతో ఇప్పుడు ఆ దిశగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సింగం సిరీస్ లో నాలుగో పార్ట్ కి కథ కూడా సిద్ధం అయ్యిందని సమాచారం.

Advertisement

ఆకాశం నీ హద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూర్య నెక్స్ట్ సినిమాగా దీనిని స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఆగష్టులో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

త్వరలో దీనిపై అఫీషియల్ అప్డేట్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.ఇందులో కూడా అనుష్క పాత్ర కొనసాగింపు ఉంటుందని, అలాగే మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉంటుందని బోగట్టా.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సుధా కొంగర దర్శకత్వంలోనే మరో సినిమా చేయడానికి సూర్య ఇప్పటికే ఒకే చెప్పాడని తెలుస్తుంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు