వింటర్‌లో ఇబ్బంది పెట్టే గొంతు నొప్పికి సింపుల్‌గా చెక్ పెట్టండిలా!

వింట‌ర్ సీజ‌న్ మొద‌లైంది.ఈ సీజ‌న్‌లో చ‌ల్ల గాలులు, మంచు కార‌ణంగా చాలా మందిని కామ‌న్‌గా గొంతు నొప్పి స‌మ‌స్య వేధిస్తుంటుంది.

ఈ స‌మ‌స్య చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ.తెగ ఇబ్బంది పెడుతుంది.

గొంతు నొప్పిగా ఉన్న స‌మ‌యంలో స‌రిగ్గా మాట్లాడ‌లేరు.ఆహారం తీసుకునే స‌మ‌యంలో కూడా నొప్పిగా ఉంటుంది.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఫాలో అయితే సులువుగా గొంతు నొప్పిని నివారించుకోవ‌చ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

Advertisement
Home Remedies For Sore Throat! Home Remedies, Sore Throat, Latest News, Health T

ఆపిల్ సైడర్ వెనిగర్ గొంతు నొప్పిని సులువుగా నివారిస్తుంది.అందువ‌ల్ల, ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా ఆపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేసి మిక్స్ చేసి సేవించాలి.

ఇలా ప్ర‌తి రోజు తాగితే.అందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గొంతు నొప్పిని దూరం చేయ‌డమే కాదు.

మ‌ళ్లీ రాకుండా చేస్తుంది.అలాగే నిమ్మ‌-తేనె కాంబినేష‌న్ డ్రింక్ కూడా గొంతు నొప్పిని దూరం చేస్తుంది.

గోరు వెచ్చ‌ని నీటితో నిమ్మ ర‌సం, తేనె కలిపి తీసుకున్నా నొప్పి త‌గ్గుతుంది.

Home Remedies For Sore Throat Home Remedies, Sore Throat, Latest News, Health T
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

గొంతు నొప్పితో బాధ ప‌డుతున్న వారు ప‌సుపుతో కూడా ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.అవును, ప‌సుపులో యాంటీసెప్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి.ఇవి గొంతు నొప్పితో పాటుగా జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేయ‌గ‌ల‌వు.

Advertisement

కాబ‌ట్టి, ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో టీ స్పూన్ ప‌సుపు క‌లిపి సేవించాలి.నీరు బ‌దులుగా పాలలో క‌లిపి సేవించినా మంచిదే.

అలాగే మెంతులు కూడా గొంతు నొప్పిని త‌గ్గిస్తాయి.అయితే మెంతులు చేదుగా ఉంటాయ‌ని.వాటిని తీసుకునేందుకు జంకుతుంటారు.

కానీ, మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.మ‌రియు గొంతు నొప్పిని సులువుగా నివారిస్తాయి.

ఒక స్పూన్ మెంతుల‌ను గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నాన‌బెట్టుకోవాలి.ఆ నీటిని ఉద‌యాన్నే తాగితే.

గొంతు నొప్పి నుంచి మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

తాజా వార్తలు