శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగల్లో గరుడ పంచమి ఒకటి.గరుత్మంతుడు సూర్య రథసారథి అయినా సూర్యుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు.
సప్త సముద్రాల లోని జలాన్నంతటనీ ఒక్క రెక్క విసిరితే కొట్టగల రెక్కల బలం కలవాడు.అందువల్లనే అతడికి సువర్ణ అనే పేరు కూడా ఉంది.
గరుడ పంచమి కి సంబంధించిన భవిష్యత్తురామంలో ప్రస్తావన ఉంది.సముద్ర మధనంలో ఉచ్పైశ్రవం అనే గుణం ఉద్భవించింది అది శ్వేతవర్ణం కలది.
కశ్యపుడు, వినత ల కుమారుడు గురుడుడు.ఓరోజు వినతి ఆమె తోటి కోడలు కద్రువ వీహర సమయంలో ఆ తెల్లటి గుర్రన్ని చూశారు.
కద్రువ వినత తో గుర్రం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉందని చెప్పగా వినత తెల్లగానే ఉంది అని చెప్పింది. కద్రువ తన కపట బుద్ధి తో సంతానమైన నాగులను పిలిచి అశ్వాలంటినీ పట్టి వ్రేలాడమని కోరగా దానికి వారు ఎవరూ అంగీకరించలేదు.
కోపగించిన కద్రువ జనమేజయుని సర్పయాగంలో నశించాలని శపించంది.ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వాలన్నిటిని వేలాడ తల్లి పందెం గెలిపించాడు.కొద్దికాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లను మొదటి గుడ్డు ను పగులగొట్టి చూసింది.అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బయటికి రాగానే అమ్మా నీ తొందరపాటు వల్ల నేను ఆకారం లేకుండా జన్మించాను.
నీవు మాత్రం రెండు వాగుడు నువ్వు తొందరపడి పగులగొట్టవద్దు అని చెప్పి సూర్యభగవానుడుకి రథసారథిగా వెళ్ళిపోయాడు.కొద్దికాలం తర్వాత జన్మించిన గరుడుడు తల్లి దాశ్యం చూడలేక విముక్తి కోసం అమృతం తెచ్చిఇమ్మన నాగుల మాటకు అనుగుణంగా అమృతం తెచ్చి అమ్మకు దాస్యం నుండి విముక్తి కలిగించాడు.
అమృతభాండాన్ని తీసుకొని వెళుతున్నా గరుత్మంతుడుని ఇంద్రుడు వజ్రాయుధంతో అడ్డుకోగా తన తల్లి దాస్యత్వం పోగొట్టడానికి ఇలా తీసుకు వెళ్తున్న అని విన్నవించాడు.నిర్మలమైన మనస్సు తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడ పంచమి.గరుడ పంచమి రోజున మహిళలు స్నానానంతరం ముగ్గులు పెట్టి పీటపై అరిటాకులు పరచి బియ్యము పోసి వారి శక్తి మేరకు బంగారం వెండి ప్రతిష్టించి పూజ చేసి పాయసం నైవేద్యంగా పెడతారు.మరికొన్ని ప్రాంతాల్లో పుట్టలో పాలు పోస్తారు ఇలా మన పూజలు అందుకుని గురుడు లాంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగజేస్తుంది.
LATEST NEWS - TELUGU