అక్కినేని జంటకు 'ఆర్‌ఎక్స్‌ 100'కు సంబంధం ఏంటో తెలిస్తే సంతోషిస్తారు!

నాగచైతన్య కెరీర్‌లో మొదటి విజయాన్ని సమంతతో కలిసి నటించిన ‘ఏమాయ చేశావే’ చిత్రంతో అందుకున్నాడు.ఆ తర్వాత కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ను ‘మనం’తో సమంతతో నటించిన సమయంలోనే అందుకున్నాడు.

 Rx100 Director To Direct Akkineni Couple-TeluguStop.com

ఇక సోలోగా నాగచైతన్య మొదటి సూపర్‌ హిట్‌ను తాజాగా సమంతతోనే ‘మజిలీ’ చిత్రం ద్వారా అందుకున్నాడు.అందుకే నాగచైతన్యకు సమంత లక్కీ ఛామ్‌గా చెప్పుకోవచ్చు.

నాగచైతన్య తన కెరీర్‌లో ఎక్కువ ఫెయిల్యూర్స్‌ను దక్కించుకున్నాడు.ఇలాంటి సమయంలో ఆయన వరుసగా సమంతతో సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇద్దరి కాంబో మూవీకి మంచి అంచనాలు ఉంటున్నాయి.అందువల్ల తప్పకుండా సినిమాలు ఆకట్టుకుంటాయి.

అందుకే మరోసారి నాగచైతన్య మరియు సమంత కలిసి నటించాలనే డిమాండ్‌ పెద్ద ఎత్తున వినిపిస్తుంది.నిర్మాతలు కూడా వీరిద్దరి డేట్లు కలిపి అడుగుతున్నారు.

విడివిడిగా ఇచ్చే పారితోషికం కంటే డబుల్‌ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు సిద్దం అవుతున్నారు.ఈ సమయంలోనే ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమాకు ప్లాన్‌ చేస్తున్నాడట.

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో దర్శకుడు ఏ స్థాయిలో స్టార్‌డం దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ప్రస్తుతం ఆ దర్శకుడు మహాసముద్రం అనే చిత్రాన్ని చేస్తున్నాడు.ఆ సినిమాలో సమంతను హీరోయిన్‌గా నటింపజేయాలని భావించాడు.కాని సమంత అందుకు ఒప్పుకోలేదు.

అదే సమయంలో ఒక కథను నాగచైతన్యకు జోడీగా నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.చైతూకు కూడా అజయ్‌ భూపతిపై నమ్మకంతో ఒక కథకు సిద్దం చేప్పాడని తెలుస్తోంది.

ఆ కథ త్వరలోనే పూర్తి స్థాయిలో మరోసారి వారిద్దరికి అజయ్‌ భూపతి చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది.అప్పుడే ఫైనల్‌గా అజయ్‌ భూపతికి అక్కినేని జంట ఓకే చెప్పే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

అయితే ప్రస్తుతం ఈ ముగ్గురికి ఉన్న కమిట్‌ మెంట్ల దృష్ట్యా 2021లో కాని ఈ కొత్త అక్కినేని జంట మూవీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube