'టిల్లు స్క్వేర్' నుండి అదిరిపోయే అప్డేట్.. రాధిక ఎంట్రీ మళ్ళీ ఉంటుందా?

గత ఏడాదిలో మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సినిమాల్లో డీజే టిల్లు( DJ Tillu ) కూడా ఉంది.

ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన డీజే టిల్లు సినిమాను ప్రేక్షకులు ఇప్పటికి ఫస్ట్ చూసినంతగానే ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సినిమాలో యూత్ ను మెయిన్ గా ఆకర్షించిన అంశం సిద్ధూ, నేహా రొమాన్స్.

వీరి కెమిస్ట్రీకి యూత్ అంతా ఫిదా అయ్యారు.నేహా శెట్టి( Neha Shetty ) రాధిక పాత్రలో ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుందో చెప్పాల్సిన పని లేదు.

ఈమె ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అనుకుంటే అనూహ్యంగా అంతగా అవకాశాలు తెచ్చుకోలేక పోయింది.ఇదిలా ఉండగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Advertisement

మల్లిక్ రామ్( Mallik Ram ) డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాకు టిల్లు స్క్వేర్( Tillu Square ) అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు.ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ ను( Anupama Parameswaran ) ఎంపిక చేసారు.ఈ జోడీ ఎలా ఉంటుందో చూడాలని ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.

ఈ సినిమా సీక్వెల్ లో కూడా రాధిక( Radhika Role ) మరోసారి ఎంట్రీ ఇస్తుంది అని టాక్.క్లైమాక్స్ లో నేహా శెట్టి రాధిక పాత్ర ఎంట్రీ ఉంటుంది అని డైరెక్టర్ కొత్తగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.మరి ఈ వార్త ఇప్పుడు బయటకు రావడంతో మరింత కిక్ ఇస్తుంది.

సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో ఈ యంగ్ హీరో ఎలాంటి హిట్ అందుకుంటాడో.అనుపమ ఏ రేంజ్ లో అందాల జాతర చేసిందో.నేహా శెట్టి ఎంట్రీ ఎలా ఉంటుందో అనేది చూడాలి.

గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...
Advertisement

తాజా వార్తలు