సేవాపథకం ఆధ్వర్యంలో శ్రమదానం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం ఆధ్వర్యంలో బుధవారం కళాశాల ఆవరణలో పిచ్చిమొక్కలను, గడ్డిని తొలగించారు.ఎన్.

ఎస్.ఎస్ వాలంటీర్లు, ఉపన్యాసకులు కలిసి పిచ్చిమొక్కలను,గడ్డిని తొలగించి, కళాశాల ఆవరణలో శుభ్రం చేశారు.

జాతీయ సేవాపథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పరశురాం మాట్లాడుతూ ఎన్.ఎస్.ఎస్ ద్వారా విద్యార్థులకు శ్రమజీవనం,సేవాభావం , అలవడటంతోపాటు, సామాజికసేవకులుగా రాణిస్తారని ఉత్తమపౌరులుగా తయారై ప్రపంచానికి ఉపయోగపడుతారనీ పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి వాసరవేణి పరశురాం,అధ్యాపకులు భూమక్క,మాదాసు చంద్రమౌళి, బుట్ట కవిత, నీరటి విష్ణుప్రసాద్,కొడిముంజ సాగర్,గీత,చిలుక ప్రవళిక, గౌతమి,బోధనేతర సిబ్బంది దేవేందర్, తాజోద్దిన్,లక్ష్మీ,50 మంది ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News